Share News

రేపు హైదరాబాద్‌లో సంవిధాన్‌ రక్షామార్చ్‌

ABN , Publish Date - Nov 24 , 2026 | 11:55 PM

ఓట్‌ బచావో - దేశ్‌ బచావో నినాదంతో ఓటు హక్కును, రాజ్యాంగ స్ఫూర్తిని, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ఈ నెల 26న ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యంలో హైదరా బాద్‌లో సంవిధాన్‌ రక్షా మార్చ్‌ నిర్వహించనున్నట్టు డీసీసీ అధ్యక్షులు, రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ పేర్కొన్నారు. మంగళవారం గోదావరి ఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

రేపు హైదరాబాద్‌లో సంవిధాన్‌ రక్షామార్చ్‌

కళ్యాణ్‌నగర్‌, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): ఓట్‌ బచావో - దేశ్‌ బచావో నినాదంతో ఓటు హక్కును, రాజ్యాంగ స్ఫూర్తిని, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ఈ నెల 26న ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యంలో హైదరా బాద్‌లో సంవిధాన్‌ రక్షా మార్చ్‌ నిర్వహించనున్నట్టు డీసీసీ అధ్యక్షులు, రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ పేర్కొన్నారు. మంగళవారం గోదావరి ఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ట్యాంక్‌ బండ్‌ అంబేద్కర్‌ విగ్రహం నుంచి నక్లెస్‌రోడ్‌లోని ఇం దిరాగాంధీ రోడ్డు వరకు ర్యాలీ జరుగనున్నదని, మేధావులు, ప్రజా స్వామిక వాదులు, యువత, నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని పిలుపుని చ్చారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈకార్య క్రమాన్ని చేప ట్టామని తెలిపారు. దేశ వ్యాప్తంగా 13కోట్ల ఓట్లను తొలగిం చారన్నారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని, అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడంతో పాటు ఇప్పటికే ఉన్న ఓటర్ల హక్కు లను కాపా డాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఒక్క రామ గుం డంలోనే 30750ఓట్లను తొలగించారని, వీరిలో చనిపోయిన వారు, ఇతర ప్రాంతా లకు వెళ్లిన వారు మినహా చిన్న చిన్న పొరపాట్లతో ఓటు హక్కు కోల్పో యిన వారికి తిరిగి ఇప్పించే కార్యక్రమం కాంగ్రెస్‌ చేపట్టిందన్నారు. వాస్తవా నికి ఓటుకు, పథకాలకు సంబంధం లేదని, ఆధారే ప్రామాణికమన్నారు.

కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్‌ కట్టుబడి ఉంది...

సింగరేణి కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందని, ఇప్ప టికే కోల్‌బెల్ట్‌ ఎమ్మెల్యేల సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు మారు పేర్ల సమస్య, డిస్మిస్‌ కార్మికులకు అవకాశం ఇవ్వడం, డిపెండెంట్‌ ఎం ప్లాయిమెంట్‌, సొంతింటి పథకం సంబంధించిన పనులు జరుగుతున్నా య న్నారు. మెడికల్‌ బోర్డుకు సంబంధించి ఈ వారంలోనే నిర్ణయాలు వెలు వడుతాయన్నారు. విలేకరుల సమావేశంలో డిప్యూటీ మేయర్‌ పాతపెల్లి ఎల్లయ్య, నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు ముస్తాఫా, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు గణముక్కుల తిరుపతి, కాలనీ అధ్యక్షుడు రమేష్‌రెడ్డి, కార్పొరేటర్లు దూళికట్ట సతీష్‌, నాయకులు దీటి బాలరాజు, తానిపర్తి గోపాల్‌రావు, కొప్పుల శంకర్‌, శ్రీనివాస్‌రెడ్డి,ఏస్త్ర రాజమల్లు, బాలరాజ్‌కుమార్‌, బి రాజిరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Nov 24 , 2026 | 11:55 PM