Share News

సమ్మేళనం పోస్టర్‌ ఆవిష్కరణ

ABN , Publish Date - Aug 23 , 2026 | 11:59 PM

మండల కేంద్రంలోని అంబేద్కర్‌ చౌక్‌లో ఆదివారం హలో స్వేరో చలో గంగాధర పోస్టర్‌ను స్వేరో ప్రతిని ధులు ఆవిష్కరించారు. ఈ నెల 30న జరగనున్న జ్ఞాన సమ్మేళనంలో అధిక సంఖ్యలో పాల్గొనాలని దాసరి ఉష కోరారు.

సమ్మేళనం పోస్టర్‌ ఆవిష్కరణ

ఎలిగేడు, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని అంబేద్కర్‌ చౌక్‌లో ఆదివారం హలో స్వేరో చలో గంగాధర పోస్టర్‌ను స్వేరో ప్రతిని ధులు ఆవిష్కరించారు. ఈ నెల 30న జరగనున్న జ్ఞాన సమ్మేళనంలో అధిక సంఖ్యలో పాల్గొనాలని దాసరి ఉష కోరారు. అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు, మౌలిక వసతులు కాదని, మన భవిష్యత్‌ తరాలకు విద్య, అవకాశాలు, నైపుణ్యాలు, సాధికారత కల్పించడమే నిజమైన అభి వృద్ధి అన్నారు. జెన్‌ జడ్‌ తమ భవిష్యత్‌ కోసం పోరాడుతుందని, వారికి అండగా నిలుద్దామన్నారు. విద్యతోపాటు ఫిట్‌నెస్‌, డిజిటల్‌ ప్రెజెన్స్‌, నైపు ణ్యాలు, వ్యాపారం, ఉపాధి రంగాల్లో యువతను ముందుకు తీసుకెళ్లాల న్నారు. ఓం ప్రకాష్‌, శ్రీకాంత్‌, అక్షయ్‌, శంకరయ్య, రమేష్‌ గౌడ్‌, రమేష్‌, నరేష్‌, ప్రవీణ్‌, వినయ్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 23 , 2026 | 11:59 PM