Share News

సింగరేణి స్థలాల క్రమబద్దీకరణకు మోక్షం

ABN , Publish Date - Oct 15 , 2026 | 11:29 PM

రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో సింగరేణి, ప్రభుత్వ స్థలాల్లో నివాసముంటూ జీఓ నెం.76 కింద వచ్చిన దర ఖాస్తులపై ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం నుంచి క్షేత్రస్థాయిలో పరిశీలన మొదలుపెట్టారు. సింగరేణి, రెవెన్యూ, నగరపాలక సంస్థ సిబ్బందితో ఆరు టీములు ఏర్పాటు చేశారు.

సింగరేణి స్థలాల క్రమబద్దీకరణకు మోక్షం

కోల్‌సిటీ, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో సింగరేణి, ప్రభుత్వ స్థలాల్లో నివాసముంటూ జీఓ నెం.76 కింద వచ్చిన దర ఖాస్తులపై ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం నుంచి క్షేత్రస్థాయిలో పరిశీలన మొదలుపెట్టారు. సింగరేణి, రెవెన్యూ, నగరపాలక సంస్థ సిబ్బందితో ఆరు టీములు ఏర్పాటు చేశారు. 1563 దరఖాస్తులు రాగా ఇంటింటికి వెళ్లి విచారణ జరుపుతున్నారు. ఆన్‌లైన్‌లో వచ్చిన దర ఖాస్తులను చెక్‌ మెమో ఆధారంగా పరిశీలన జరుగు తుంది. ఇంటి పన్ను రశీదులు, నల్లా, విద్యుత్‌ బిల్లులు సర్వే నెంబర్ల ఆధారంగా విచారిస్తున్నారు. రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని గోదావరిఖనితోపాటు యైుటింక్లయిన్‌కాలనీ ప్రాంతాల్లో ఈ సర్వే జరుగనున్నది. రామగుండం రీజియన్‌లోని జనగామ, మల్కాపూర్‌, అల్లూరు శివారుల్లోని కేకేనగర్‌, ఇందిరానగర్‌, లక్ష్మీనగర్‌, హనుమాన్‌నగర్‌, సంతోష్‌నగర్‌ ప్రాంతాల్లో భూములను క్రమబద్దీకరించేందుకు ఈ జీఓలో సర్వే నెంబర్లు చేర్చారు. జనగామ, మల్కాపూర్‌ శివారుల్లోని 40.42 ఎక రాల భూమిని రెవెన్యూ సింగరేణికి అప్పగించింది. వాస్తవానికి దరఖాస్తులను పరిశీలన చేయాలంటే 200ఎకరాల భూములను అప్పగించాల్సి ఉంటుంది. గోదా వరిఖని పట్టణంలోని సీతానగర్‌, రాంనగర్‌, విఠల్‌నగర్‌, తిలక్‌నగర్‌, రమేష్‌నగర్‌, ఎల్‌బీనగర్‌ తదితర ప్రాంతాల్లో సర్వే నెంబర్లను ఈ జీఓలో పొందుపర్చలేదు. మొత్తం 6645 దరఖాస్తులు వస్తే 1298దరఖాస్తులనే సిఫార్సు చేశారు. 2009లో సింగరేణి సంస్థ ప్రభుత్వానికి భూము లు అప్పగించగా ఆ సర్వే నెంబర్‌ను సైతం పరిగణలోకి తీసుకోవడం లేదు. దరఖాస్తు చేసుకున్న స్థలం సింగరేణి, రెవెన్యూ పరిధిలో ఉంటే పట్టాలు ఇవ్వాల్సిందేనని ప్రజల నుంచి మాత్రం డిమాండ్‌ వస్తుంది. మొదటి రోజు 146దరఖాస్తులను పరిశీలించారు.

Updated Date - Oct 15 , 2026 | 11:29 PM