Share News

ఖనిలో భక్తిశ్రద్ధలతో రన్‌ ఫర్‌ జీసస్‌

ABN , Publish Date - Apr 04 , 2026 | 11:27 PM

ఇంటర్‌ డినా మినేషనల్‌ పాస్టర్స్‌ ఫెలోషిప్‌ ఆధ్వర్యంలో శనివారం గోదావరిఖనిలో రన్‌ ఫర్‌ జీసస్‌ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం ఫైవింక్లయిన్‌ నుంచి అధిక సంఖ్యలో క్రైస్తవులు రన్‌ ఫర్‌ జీసస్‌ కార్యక్ర మాన్ని మేయర్‌ మహంకాళి స్వామి హాజరై ప్రార్థనలు చేసి శాంతికి ప్రతీకగా పావురాలను ఎగురవేసి ర్యాలీని ప్రారంభించారు.

ఖనిలో భక్తిశ్రద్ధలతో రన్‌ ఫర్‌ జీసస్‌

కోల్‌సిటీటౌన్‌, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ డినా మినేషనల్‌ పాస్టర్స్‌ ఫెలోషిప్‌ ఆధ్వర్యంలో శనివారం గోదావరిఖనిలో రన్‌ ఫర్‌ జీసస్‌ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం ఫైవింక్లయిన్‌ నుంచి అధిక సంఖ్యలో క్రైస్తవులు రన్‌ ఫర్‌ జీసస్‌ కార్యక్ర మాన్ని మేయర్‌ మహంకాళి స్వామి హాజరై ప్రార్థనలు చేసి శాంతికి ప్రతీకగా పావురాలను ఎగురవేసి ర్యాలీని ప్రారంభించారు. మేయర్‌ మాట్లాడుతూ క్రీస్తు చూపిన ప్రేమ, శాంతి మార్గాలు సమాజానికి దిక్సూచి అని, శాంతియుత సమాజ నిర్మాణంలో క్రైస్తవ సమాజం ఎల్లప్పుడు కీలక పాత్ర పోషిస్తుందని కొనియాడారు. ఫైవింక్లయిన్‌ నుంచి భక్తిగీతాలు అలాపిస్తూ ప్రధాన చౌరస్తాకు చేరుకొని సమాజ శ్రేయస్సు కోరుతూ పాస్టర్లు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఐపీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు పాస్టర్‌ ఎం.మహిపాల్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి డిలైట్‌ నతనియేల్‌రెడ్డి, వైస్‌ ప్రెసిడెంట్‌ దాస్‌, జాయింట్‌ సెక్రటరీ ప్రజార్షి, కోశాధికారి థామస్‌, ఎగ్జిక్యూటీ సభ్యులు రవివర్మ, ప్రసన్న, ప్రభాకర్‌, ఎఫ్రాయిమ్‌, శాంతి రాజు, మేరక్క, ఐజయ్య, నిరీక్షణ్‌, రాయప్పరెడ్డి, నాయకులు జిమ్మిబాబు, దయానంద్‌గాంధీ పాల్గొన్నారు.

Updated Date - Apr 04 , 2026 | 11:27 PM