ఎలక్ర్టిక్ బస్సులను ఆర్‌టీసీ నడిపించాలి
ABN , Publish Date - Mar 24 , 2026 | 11:48 PM
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ డిపోల్లో నడుస్తున్న ఎలక్ర్టిక్ బస్సులను ఆర్‌టీసీ యాజమాన్యమే నడిపించా లంటూ మంగళవారం గోదావరిఖని ఆర్‌టీసీ డిపో ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
కళ్యాణ్‌నగర్, మార్చి 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా వివిధ డిపోల్లో నడుస్తున్న ఎలక్ర్టిక్ బస్సులను ఆర్‌టీసీ యాజమాన్యమే నడిపించా లంటూ మంగళవారం గోదావరిఖని ఆర్‌టీసీ డిపో ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఐఎఫ్‌టీయూ కార్మిక సంఘం మద్దతు తెలిపింది. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వేల్పుల కుమారస్వామి, ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ ప్రైవేట్ వ్యక్తులు ఎలక్ర్టిసిటీ బస్సులను అద్దెకు పెంచి తిప్పుతు న్నారని, అలా కాకుండా యాజమాన్యమే ఎలక్ర్టిక్ బస్సులు నడిపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఆర్‌టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తా మని చెప్పి రెండున్నర సం వత్సరాలు అయినా పరిష్క రించడం లేదన్నారు. ఎల క్ర్టిక్ బస్సుల్లో స్కీమ్ అమ లు చేయడం వల్ల ఆర్‌టీసీ బస్సులకు ఎలాంటి ప్రాధా న్యం లేకుండా చేశారని, దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు లాభా లు చేసే విధంగా ఆర్‌టీసీ అధికారులు ప్రయత్ని స్తున్నారని, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఆర్‌టీసీ సంస్థ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం సరైంది కాదన్నారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, లేకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. నాయకులు నర హరి, కృష్ణ, మల్లయ్య, రాజేశం, కొమురయ్య, రం గన్న, మద్దెల శ్రీనివాస్, ఏబీ స్వామి, శ్రీను, చంద్రయ్య, ప్రసాద్, రాజయ్య, కనకయ్య, బీఆర్ స్వామి, కేకే రాజు, బిక్షపతి పాల్గొన్నారు.