కొనసాగుతున్న ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె
ABN , Publish Date - Apr 24 , 2026 | 11:49 PM
ఆర్‌టీసీ ఉద్యోగుల సమ్మె మూడవ రోజు శుక్రవారం కొనసాగుతుంది. గోదావరిఖని ఆర్‌టీసీ డిపోలో 500మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటుండగా అద్దె బస్సుల డ్రైవర్లు కూడా సమ్మెలో పాల్గొనాలని ఆర్‌టీసీ జేఏసీ సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. దీంతో శుక్రవారం అద్దె బస్సుల యజమానులు సమ్మెకు మద్దతు ప్రకటించారు.
కళ్యాణ్‌నగర్, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): ఆర్‌టీసీ ఉద్యోగుల సమ్మె మూడవ రోజు శుక్రవారం కొనసాగుతుంది. గోదావరిఖని ఆర్‌టీసీ డిపోలో 500మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటుండగా అద్దె బస్సుల డ్రైవర్లు కూడా సమ్మెలో పాల్గొనాలని ఆర్‌టీసీ జేఏసీ సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. దీంతో శుక్రవారం అద్దె బస్సుల యజమానులు సమ్మెకు మద్దతు ప్రకటించారు. అద్దె బస్సులు బయటకు రాలేదు. నర్సంపేట ఆర్‌టీసీ డ్రైవర్ శంకర్ మృతికి సంతాపంగా ఉద్యోగులు నల్ల రిబ్బన్ కట్టుకుని మౌన ప్రద ర్శన నిర్వహించారు. అనంతరం డిపో ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆర్‌టీసీ జేఏసీ చైర్మన్ వంగర శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభు త్వం నిర్లక్ష్యం వల్లనే శంకర్ మృతి చెందాడని, ఆర్‌టీసీని ప్రభుత్వంలో విలీ నం చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మాట మార్చిందని, 10 సంవత్స రాలుగా వేతనాలు, డీఏ పెంచడం లేదని, యూనియన్లను ఏర్పాటు చేస్తా మని రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆర్‌టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా మొండిగా వ్యహరిస్తుందని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చొరవచూపి ఆర్‌టీసీ కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
పలు పార్టీ మద్దతు
ఆర్‌టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు పలు పార్టీలు మద్దతు తెలిపాయి. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, బీజేపీతోపాటు రామగుండం లారీ అసోసి యేషన్ నాయకులు తమ మద్దతు తెలిపారు. ప్రభుత్వం వెంటనే కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. మద్దతు ఇచ్చిన వారిలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు ఐ కృష్ణ, ఈదునూరి నరేష్, రాజేశం, దుర్గయ్య, బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి మృతి చెందిన శంకర్‌గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ముందుకు రాని తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు
సమ్మె నేపథ్యంలో ఆర్‌టీసీ తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను ఆహ్వానిం చింది. కానీ వారి నుంచి స్పందన రాలేదు. కేవలం 8మంది డ్రైవర్లు, 90 మంది కండక్టర్లు దరఖాస్తులను సమర్పించారు. ఇందులో అర్హత గల వారిని ఎంపిక చేసినప్పటికీ బస్సులను మాత్రం డిపో నుంచి తీయడం లేదు. శుక్రవారం మూడు అద్దె బస్సులను ఉదయం కరీంనగర్ డిపో వరకు నడిపించగా ఎలక్ర్టికల్ బస్సులు కరీంనగర్ డిపో నుంచి మంచిర్యాలకు నడుస్తున్నాయి. సమ్మెతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. ఆర్‌టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించి బస్సులు నడిపించే విధంగా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు.
రోజుకు రూ.14లక్షల ఆదాయానికి నష్టం...
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే గోదావరిఖని ఆర్‌టీసీ డిపో అత్యధిక ఆదాయాన్ని తీసుకువస్తుంది. వివిధ రూట్లలో 120 సర్వీసులను నడుపుతూ రోజుకు రూ.14లక్షల ఆదాయం తీసుకువస్తుండగా మూడు రోజుల సమ్మెతో రూ.50లక్షల నష్టం వాటిల్లింది. గురు, శుక్రవారాల్లో అద్దె బస్సులు నడుపగా కేవలం రూ.1లక్ష ఆదాయంతో సరిపెట్టుకుంది. అద్దె బస్సుల యజమానులు కూడా శుక్రవారం నుంచి సమ్మెకు మద్దతు ప్రకటించడంతో ఆర్‌టీసీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. జేఏసీ నాయకులు ఇందిరారాణి, సులోచన,శ్రీలత, లక్ష్మి, తిరుపతి, సామ్యుల్, కార్తీక్, నాగరాజు, చారి, మంజుల, తిరుమల, శ్రీనివాస్, శ్రీలత పాల్గొన్నారు.
మంథని డిపోలో...
మంథని, (ఆంధ్రజ్యోతి): డిమాండ్ల సాధన కోసం మంథని ఆర్టీసీ డిపో కార్మికులు శుక్రవారం సమ్మెలో పాల్గొన్నారు. డిపో, బస్టాండ్ వద్ద ప్రభు త్వం సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్ర మాలు చేపట్టారు. ఆత్మహత్య చేసుకున్న నర్సయ్యగౌడ్ మృతిపై మౌనం పాటించి సంతాపం వ్యక్తంచేశారు. కార్మికుల సమ్మెకు పలువురు సంఘీ భావం ప్రకటించారు. డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. డిపో పరిధిలోని 24 అద్దె బస్సులను గోదావరిఖని, కరీంనగర్, భూపాలపల్లితోపాటు ఇతర రూట్లలో నడిపినట్లు డీఎం శ్రావణ్‌కుమార్ తెలిపారు. సమ్మె కారణంగా మంథని సీఐ రాజు, ఎస్‌ఐ రమేష్‌ల ఆధ్వ ర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సమ్మెలో జేఏసీ చైర్మన్ కేకే రెడ్డి, వైస్ చైర్మన్ ఐలయ్య, నేతలు ఖాదర్, గంధం రమేష్, ఖుతుబోద్దీన్, జనార్ధన్, సదయ్య, పోచయ్య, జేడీ నాయక్, ఇంతియాజ్‌బేగం, కార్మికులు పాల్గొన్నారు.