ఆర్వోబీ పనులు నెలాఖరులోగా పూర్తి చేయాలి
ABN , Publish Date - Jul 14 , 2026 | 12:00 AM
కూనారం రైల్వే ఫ్లైఓవర్ (ఆర్వోబీ) నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసి నెలాఖరు లోగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావా లని కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధి కారులను ఆదేశించారు. సోమవారం కూనారం రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణ పనులను పరిశీలించారు.
పెద్దపల్లి టౌన్, జూలై 13 (ఆంధ్రజ్యోతి): కూనారం రైల్వే ఫ్లైఓవర్ (ఆర్వోబీ) నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసి నెలాఖరు లోగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావా లని కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధి కారులను ఆదేశించారు. సోమవారం కూనారం రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం డీసెంట్ ఫంక్షన్ హాల్‌లో కొనసాగు తున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించి అధి కారులకు సూచనలు చేశారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, కూనారం ఆర్వోబీ నిర్మా ణ పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిరం తరాయంగా కొనసాగాలన్నారు. విద్యుత్, రెవెన్యూ, ఆర్‌అండ్‌బి అధికారులు సమన్వయం తో పనిచేసి పనుల పురోగతిని వేగవంతం చేయాలని సూచించారు. అనంతరం ఎస్‌ఐఆర్ ప్రక్రియ పురోగతిని సమీక్షించిన కలెక్టర్, ఎన్యూ మరేషన్ ఫారాల డిజిటలైజేషన్‌ను పూర్తి చేయాలని అధికారులకు లక్ష్యాన్ని నిర్ధేశించారు. ప్రతీ ఓటరును చైతన్యపరిచి ఎన్యూమరేషన్ ఫారాలు నింపించి బీఎల్‌వోలకు అందజేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫారాలు నింపడంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా అధికారులు, సిబ్బంది పూర్తి సహకారం అందించాలని తెలిపారు. ఫారాలను తిరిగి బీఎల్‌వోలకు సమర్పించకపోతే ఓటరు నమో దుపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున ప్రతీ ఓటరు ఫారాలను తప్పనిసరిగా అందజే యాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆర్‌అండ్‌బి ఈఈ భావ్‌సింగ్, ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ గం గాధర్, పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య, మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.