Share News

ప్రజల అభిప్రాయం మేరకే ఆర్వోబీ నిర్మాణం

ABN , Publish Date - Oct 02 , 2026 | 11:57 PM

ప్రజలు, ప్రజాప్రతినిధుల అభిప్రా యాల మేరకే ఆర్వోబీ నిర్మిస్తామని ప్రభుత్వ విప్‌ చింతకుంట విజయ రమణారావు అన్నారు. శుక్రవారం పొత్కపల్లిలో ఆర్వోబీ నిర్మాణ స్థలాల ను నాయకులు, అధికారులతో కలిసి పరిశీలించారు.

ప్రజల అభిప్రాయం మేరకే ఆర్వోబీ నిర్మాణం

ఓదెల, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): ప్రజలు, ప్రజాప్రతినిధుల అభిప్రా యాల మేరకే ఆర్వోబీ నిర్మిస్తామని ప్రభుత్వ విప్‌ చింతకుంట విజయ రమణారావు అన్నారు. శుక్రవారం పొత్కపల్లిలో ఆర్వోబీ నిర్మాణ స్థలాల ను నాయకులు, అధికారులతో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడు తూ ఆర్వోబీ నిర్మాణానికి రైల్వే అధికారులతో కలిసి జమ్మికుంట రైల్వే ఓవర్‌ బ్రిడ్జిని పరిశీలిస్తామని, పొత్కపల్లిలో అందరి అభిప్రాయం మేరకు పనులు చేపడతామన్నారు. ప్రభుత్వ పాఠశాల ముందు నుంచి వార సంత స్థలాన్ని ఆనుకొని గుంపుల రోడ్డుకు కలిపే స్థలాలను పరిశీలిం చారు. అనంతరం రూపునారాయణపేట, పొత్కపల్లి నుంచి కాల్వ శ్రీరాం పూర్‌ వైపు నిర్మిస్తున్న డబుల్‌ రోడ్డు పనులను పరిశీలించారు. ఓదెల భ్రమరాంబ మల్లికార్జున స్వామి క్షేత్రంలో రూ.15 కోట్లతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను తనిఖీ చేశారు. బంగారు పోచమ్మ ఆలయానికి ఆటంకం లేకుండా రోడ్డు నిర్మించే విధంగా స్థలాల సర్దుబాటు చేసుకోవాలని కోరా రు. తహసీల్దార్‌ వనజ, పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్‌ సాగర్‌ రెడ్డి, సింగిల్‌ విండో చైర్మన్‌ ఆళ్ళ సుమన్‌రెడ్డి, సర్పంచ్‌ అంబాల సార మ్మ, కొమరయ్య, ల్యాండ్‌ అక్వేషన్‌ అధికారి దేవరాజు, రైల్వే అధికారి, బొంగోనీ శ్రీనివాస్‌, సిరిసేటి రాహుల్‌, సర్పంచులు, ఉప సర్పంచులు రెడ్డి రజినీకాంత్‌, మాజీ సర్పంచులు రాజన్న, రమేష్‌, నాయకులు శంకర్‌, వంగ శ్రీనివాస్‌,మేకల అనిల్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 02 , 2026 | 11:57 PM