45 రోజుల్లో రైస్‌మిల్లర్లు బకాయిలు చెల్లించాలి
ABN , Publish Date - Oct 23 , 2026 | 11:34 PM
డిఫాల్ట్ రైస్‌మిల్లర్లు పెం డింగ్ బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం మరో 45 రోజుల గడువు ఇచ్చిందని అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు తెలిపారు. శుక్ర వారం కలెక్టరేట్లో ఛాంబర్లో సంబంధిత అధికారులు, డిఫాల్ట్ రైస్‌మిల్లర్లతో బకాయిల వసూళ్లపై ఆయన సమీక్ష నిర్వహించారు.
పెద్దపల్లి, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): డిఫాల్ట్ రైస్‌మిల్లర్లు పెం డింగ్ బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం మరో 45 రోజుల గడువు ఇచ్చిందని అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు తెలిపారు. శుక్ర వారం కలెక్టరేట్లో ఛాంబర్లో సంబంధిత అధికారులు, డిఫాల్ట్ రైస్‌మిల్లర్లతో బకాయిల వసూళ్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం కల్పించిన 45 రోజుల గడువును సద్వినియోగం చేసుకొని, పెండింగ్ బకాయిలను నిర్ణీత గడువులోగా చెల్లించాలని సూచించారు. డిఫాల్ట్ రైస్‌మిల్లర్లకు సంబంధించిన స్థిర, చర ఆస్తుల వివరాలను సబ్ రిజిస్ట్రార్ అధికా రులు గుర్తించి, పూర్తి వివరాలను సేకరించాలని ఆదేశించారు. ప్రభుత్వం కల్పించిన 45 రోజుల గడువులోగా బకాయిలు చెల్లించని పక్షంలో సంబంధిత రైస్‌మిల్లర్ల ఆస్తులను జప్తు చేసేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆర్డీఓ గంగయ్య, జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనాథ్, పౌరసరఫరాల మేనేజర్ శ్రీకాంత్, సబ్ రిజిస్ట్రార్ అధికారులు, రైస్‌మిల్లర్లు పాల్గొన్నారు.