ఆర్‌ఎఫ్‌సీఎల్ ఉద్యోగాల్లో కోత...
ABN , Publish Date - Mar 03 , 2026 | 12:12 AM
రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్‌ఎఫ్‌సీఎల్) ఉద్యోగాల్లో కోత పెట్టేందుకు నిర్ణయించుకున్నట్టు తెలు స్తున్నది. పరిశ్రమలో ఈ ఏడాది సాంకేతిక అవరోధా లతో ఉత్పత్తి నిలిచిపోవడం, నష్టాల నేపథ్యంలో ఉత్పత్తి వ్యయం తగ్గించుకోవాలని, ఈ మేరకు వేతన భారం కూడా తగ్గించాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫెర్టిలైజ ర్స్ (డీవోఎఫ్) సూచించినట్టు సమాచారం.
కోల్‌సిటీ, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్‌ఎఫ్‌సీఎల్) ఉద్యోగాల్లో కోత పెట్టేందుకు నిర్ణయించుకున్నట్టు తెలు స్తున్నది. పరిశ్రమలో ఈ ఏడాది సాంకేతిక అవరోధా లతో ఉత్పత్తి నిలిచిపోవడం, నష్టాల నేపథ్యంలో ఉత్పత్తి వ్యయం తగ్గించుకోవాలని, ఈ మేరకు వేతన భారం కూడా తగ్గించాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫెర్టిలైజ ర్స్ (డీవోఎఫ్) సూచించినట్టు సమాచారం. దీంతో ఆర్‌ఎఫ్‌సీఎల్ యాజమాన్యం అనివార్యంగా ఉద్యోగాల కోతకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే నాన్ ఎగ్జిక్యూటివ్ నియామకాలకు మంగళం పాడిన ఆర్‌ఎఫ్‌సీఎల్ యాజమాన్యం భవిష్యత్‌లో ఎగ్జిక్యూటివ్, అవుట్ సోర్సింగ్ నియామకాలకు స్వస్తి పలుకనున్నది. చివరికి కాంట్రాక్టు కార్మికుల సంఖ్యను కూడా తగ్గిం చాలనే నిర్ణయం తీసుకున్నది.
కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా రూ.6500కోట్ల వ్యయంతో రామగుండంలో యేటా 12 లక్షల టన్నుల సామర్థ్యం గల ఎరువుల కర్మాగారాన్ని నిర్మించింది. డెన్మార్క్ టెక్నాలజీతో పూర్తి ఆటోమేటెడ్ ప్లాంట్ నిర్మించారు. దీంతో అధికారులు, ఉద్యోగులు, కార్మికుల అవసరం గణనీయంగా తగ్గింది. కేవలం 450 మంది అధికారులు, ఉద్యోగులు, 1200మంది కాంట్రాక్టు కార్మికులతో పరిశ్రమ నడిపేలా ప్రణాళికలు చేశారు. ప్రస్తుతం 420వరకు అధికారులు, ఉద్యోగులు, 1200 మంది కాంట్రాక్టు కార్మికులు పని చేస్తున్నారు. వీరికి యేటా వేతనాలకు సుమారు రూ.50కోట్లు యాజమా న్యం వ్యయం చేస్తుంది. 2024-25 ఆర్థిక సంవత్స రంలో ఎలాంటి సాంకేతిక అవరోధాలు ఏర్పడక పోవ డంతో 94శాతం సామర్థ్యంతో 11.9లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి జరిగింది. రూ.5,260కోట్ల టర్నో వర్‌తో రూ.414కోట్ల నికర లాభాలను ఆర్జించింది. కాగా వ్యయం రూ.4738కోట్లుగా ఉంది. ఇందులో రూ.1171 కోట్లు గ్యాస్, విద్యుత్ బిల్లులు కాగా, వేతనాలు రూ.50 కోట్ల వరకు ఉన్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమలో రూ.414కోట్ల నికర లాభాలను ఆర్జించినా పరిశ్రమ ఉత్పత్తి ప్రారంభమైన తొలినాళ్లలో నష్టాలు రావడంతో 2025మార్చి 31నాటికి రూ.158కోట్ల నష్టాల్లో ఉంది. దీంతో 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి డివిడెండ్‌ను కూడా బోర్డు ఆమోదించలేదు.
హెచ్‌టీఆర్ వైఫల్యంలో కోలుకోలేని దెబ్బ...
ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో 2025-26 ఆర్థిక సంవత్సరంలో హెచ్‌టీఆర్ వైఫల్యంతో పరిశ్రమకు కోలుకోలేని దెబ్బ పడింది. ఏకంగా 114రోజులు షట్‌డౌన్ కావడంతో రూ.250 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ప్రస్తుతం 94శాతం సామర్థ్యంతోనే ఉత్పత్తి జరుగుతుంది. రోజుకు 3250 టన్నుల ఉత్పత్తి సామర్థ్యానికిగాను 300టన్నులు తగ్గించి ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 8లక్షల టన్నుల ఉత్పత్తి మాత్రమే జరిగింది. మార్చిలో లక్ష టన్నులపైన ఉత్పత్తి జరిగినా 9లక్షలకు చేరుకుం టుంది. లాభాలు రూ.20కోట్ల నుంచి రూ.30కోట్లకు మించి సాధించే అవకాశం లేదు. పైగా హెచ్‌టీఆర్ మరమ్మతులకు డెన్మార్క్‌కు పంపించాల్సి ఉంది. దీనికి రూ.50కోట్ల వరకు వ్యయం అయ్యే అవకాశం ఉంది. జెడ్‌ఎల్‌డీ నిర్మాణానికి టెండర్లు ఖరారు చేశారు. దీనికి రూ.150కోట్ల మేర వ్యయం చేయాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో పరిశ్రమ మొత్తం నష్టాలు మార్చి 2026నాటికి రూ.300కోట్లు దాటే అవకాశం ఉంది.
ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో వేతనాలకు కటకటే...
ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో నెలవారి వేతనాలకు వెతుక్కోవా ల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 2023-24లో యేటా రూ.45 కోట్లు వేతనాలకు వెచ్చిస్తే, 2024-25లో రూ.49.53కోట్లు వేతనాలకు వెచ్చించింది. ఈ ఏడాది ఎగ్జిక్యూటివ్ నియామకాలు కూడా జరిగాయి. సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం నుంచే రూ.150కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉంది. సంస్థకు ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో బకా యిలు రాకపోతే గట్టెక్కే పరిస్థితి లేదు. ఆర్‌ఎఫ్‌సీ ఎల్‌లో వినియోగించిన టెక్నాలజీ విఫలం కావడంతో ఆర్థిక సంక్షోభం తలెత్తింది. హెచ్‌ఈయూఆర్‌ఎల్ వంటి ఎరువుల కర్మాగారాల్లో లక్ష్యానికి తగ్గట్టు ఉత్పత్తి జరుగుతుంది. ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో మాత్రం ఉత్పత్తి తగ్గుతూ వస్తుంది.
కోత అనివార్యమా..!
ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ఉద్యోగాల కోత అనివార్యమయ్యే పరిస్థితి ఉంది. ఇటీవల స్థానిక ప్రజాప్రతినిధులకు కూడా యాజమాన్యం ఈ మేరకు సంకేతాలిచ్చింది. కొత్తగా ప్రభావిత ప్రాంతాల నిరుద్యోగులను పనుల్లో పెట్టుకోవాలని కోరగా తాము 20శాతం ఉద్యోగాలు తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నామని, కొత్త నియా మకాలకు అవకాశం లేదని తేల్చి చెప్పారు. ఆర్‌ఎఫ్‌సీ ఎల్ సాంకేతిక వైఫల్యాలతో ఇప్పటికే 50 నుంచి 60మంది అధికారులు పరిశ్రమను వీడి ఇతర పరిశ్ర మల్లో చేరారు. వీరి స్థానాల్లో ఇక భర్తీ చేసే అవకా శాలు లేవు. అలాగే కాంట్రాక్టు కార్మికుల సంఖ్యను కూడా వెయ్యి వరకు కుదించే అవకాశం ఉంది. ఇతర జిల్లాల వారు, వయసు మీరిన వారు, పనుల్లో నైపు ణ్యం లేని వారు తదితర క్యాటగిరిలుగా తొలగించే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రత్యా మ్నాయంగా 58 సంవత్సరాల వయసు దాటిన వారి స్థానంలో కొత్త వారి నియామకాలు నిలిపి వేయ నున్నారు.