Share News

ఆలయ అభివృద్ధి పనులపై సమీక్ష

ABN , Publish Date - Jul 31 , 2026 | 11:32 PM

జిల్లాలోని ప్రముఖ క్షేత్రమైన భ్రమరాంబ మల్లికార్జున స్వామి అభివృద్ధి పనులపై శుక్రవారం ప్రభుత్వ విప్‌ చింతకుంట విజయ రమణారావు పరిశీలించారు. ఆలయ పరిసరాల్లో పారదర్శకమైన అభివృద్ధికికి రూ.17 కోట్ల నిధులు మంజూరయ్యాయి.

ఆలయ అభివృద్ధి పనులపై సమీక్ష

ఓదెల, జూలై 31 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రముఖ క్షేత్రమైన భ్రమరాంబ మల్లికార్జున స్వామి అభివృద్ధి పనులపై శుక్రవారం ప్రభుత్వ విప్‌ చింతకుంట విజయ రమణారావు పరిశీలించారు. ఆలయ పరిసరాల్లో పారదర్శకమైన అభివృద్ధికికి రూ.17 కోట్ల నిధులు మంజూరయ్యాయి. అలాగే మరో రూ.రెండు కోట్లతో ఆలయం చుట్టూ రోడ్డు నిర్మాణం, విస్తరణ పనుల నిర్వహణకు మంజూరయ్యాయి. పనుల్లో జాప్యం చేయకుండ రోడ్డు విస్తరణ పనులను చేపట్టేందుకు ప్రభుత్వ విప్‌ స్థానిక నేతలతో నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. రోడ్డు నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న వాటిని గుర్తించారు. గతంలో ఆలయ భూముల సర్వేలో వచ్చిన వాటిపై ఆరా తీశారు. భక్తులకు ఇబ్బంది లేకుండా వాహనాలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించేందుకు, రోడ్ల విస్తరణ చేపట్టేందుకు రూపకల్పన చేశారు. మూల ప్రేమ్‌ సాగర్‌ రెడ్డి, చీకట్ల మొండయ్య, ఆళ్ళ సుమన్‌ రెడ్డి, గోపు నారాయణరెడ్డి, ఆకుల మహేందర్‌, ఈవో సదయ్య, ఏడి రవీందర్‌, ఏఈ మోహన్‌, సర్పంచ్‌ గోలి లింగారెడ్డి, ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రెడ్డి రజనీకాంత్‌, చింతం కుమారస్వామి, నాగపూరి రవి, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Jul 31 , 2026 | 11:32 PM