రెవెన్యూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలి
ABN , Publish Date - Jul 31 , 2026 | 11:37 PM
రెవెన్యూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ శ్రీరాములు అధికారులను ఆదేశిం చారు. శుక్రవారం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రెవెన్యూ వ్యవహారాలపై సమీక్షించారు. అనంతరం ఆయన ఎల్లంపల్లి ప్రాజెక్టును పరిశీలించి ప్రస్తుత వరద పరిస్థితులను తెలుసుకున్నారు.
అంతర్గాం, జూలై 31 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ శ్రీరాములు అధికారులను ఆదేశిం చారు. శుక్రవారం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రెవెన్యూ వ్యవహారాలపై సమీక్షించారు. అనంతరం ఆయన ఎల్లంపల్లి ప్రాజెక్టును పరిశీలించి ప్రస్తుత వరద పరిస్థితులను తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న భూ సర్వే కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో పూర్తి చేయాలన్నారు. మీసేవ ద్వారా అందిన దర ఖాస్తులను ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలన్నారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ తదితర అంశాలలో అధికారులు జాగ్ర త్తగా వ్యవహరించాలన్నారు. స్పిన్నింగ్ మిల్ భూములను తహసీల్దార్‌తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తహసీల్దార్ పడాల ప్రసాద్, ఎల్లంపల్లి ప్రాజెక్టు అధికారులు రవీంద్రచారి, కీర్తి, పాల్గొన్నారు.