వంట గ్యాస్ బుకింగ్‌పై ఆంక్షల సడలింపు..
ABN , Publish Date - Sep 14 , 2026 | 12:27 AM
పశ్చిమాసియా యుద్ధం ప్రభావంతో గ్యాస్ వినియోగంపై విధించిన ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం సడలించింది. దీంతో ఇప్పటివరకు 45 రోజుల వ్యవధి ముగిసే వరకు ఎదురు చూడాల్సిన వినియోగదారులకు ఇక 25 రోజులకే మరో సిలిండర్ బుక్ చేసుకునే వెసలుబాటు కలిగింది.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
పశ్చిమాసియా యుద్ధం ప్రభావంతో గ్యాస్ వినియోగంపై విధించిన ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం సడలించింది. దీంతో ఇప్పటివరకు 45 రోజుల వ్యవధి ముగిసే వరకు ఎదురు చూడాల్సిన వినియోగదారులకు ఇక 25 రోజులకే మరో సిలిండర్ బుక్ చేసుకునే వెసలుబాటు కలిగింది. ఐదు రోజుల క్రితం అమల్లోకి వచ్చిన ఈ సడలింపుతో గృహ విని యోగదారులకు కొంత ఊరట లభించింది. యుద్ధం నేపథ్యం లో గ్యాస్ కొరత ఏర్పడకుండా ప్రభుత్వం విధించిన ఆంక్షల కారణంగా ఇన్నాళ్లూ సిలిండర్‌ను పొదుపుగా వినియోగిం చుకోవాల్సి వచ్చింది. అత్యవసర పరిస్థితుల్లో సిలిండర్ కోసం బహిరంగ మార్కెట్‌ను ఆశ్రయించిన వారు రూ.2 వేల వరకు చెల్లించాల్సి వచ్చింది. దీంతో అనేక కుటుంబాలు గ్యాస్ వినియోగాన్ని తగ్గించుకుని కట్టెల పొయ్యిలపై వంట చేసుకున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా కనిపించింది. ఇప్పుడు బుకింగ్ గడువు తగ్గడంతో సాధారణ వినియోగం మళ్లీ పెరిగే అవకాశం ఉంది. సాధారణంగా నెల రోజుల్లో ఖాళీ అయ్యే గ్యాస్ సిలిండర్‌ను వినియోగదారులు 45 రోజుల వరకు పొదుపుగా వాడుకున్నారు.
జిల్లాలో 2.50 లక్షలకు పైగా కనెక్షన్లు
జిల్లాలోని 26 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో భారీగా వినియోగ దారులు ఉన్నారు. జనరల్ కనెక్షన్లు 1,67,943, దీపం 38157 సీఎస్సార్ 16634, ఉజ్వల 24236, వాణిజ్య 2174, ఇతర కేటగిరీల్లో 468 కనెక్షన్లు ఉన్నాయి. గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ ధర ప్రస్తుతం 1013 రూపాయలు ఉండగా, వాణిజ్య సిలిండర్ ధర 3035.50గా ఉంది. గ్యాస్ కొరత ప్రభావం వాణిజ్య రంగంపైనా ఎక్కువగా పడింది. హోటళ్లు, రెస్టారెంట్లు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వాహకులు సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొరతను అధిగమించేందుకు ఏజెన్సీలు ఐదు కిలోల వాణిజ్య సిలిం డర్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చినా అవసరాలకు సరిపడా సరఫరా లేకపోవడంతో పలుచోట్ల కట్టెల పొయ్యిలు, ఎలక్ట్రికల్ పొయ్యిలపైనే వంటలు చేయాల్సి వచ్చింది.
బ్లాక్ మార్కెట్‌ను నివారించాలి
వంట గ్యాస్ సరఫరా రోజులను 45 నుంచి 25 రోజులకు తగ్గించడంతో గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకునే అవకాశాలు ఉన్నాయి. వాణిజ్య సిలిండర్ల ధర రూ.3000లకు పైగా ఉండ డమే ఇందుకు కారణం. సాధారణ సిలిండర్‌లను ఆయా మార్గాల ద్వారా బుకింగ్ చేయించుకుని హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, టీస్టాల్స్ నిర్వాహకులు వాణిజ్య సిలిండర్లకు బదులు గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్లను వాడుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గృహ అవసరాల సిలిండర్లను 500 రూపాయలకే ఇస్తుం డడంతో సిలిండర్‌లను 1500 రూపాయల వరకు విక్రయిం చుకుని సొమ్ము చేసుకునే అవకాశం ఉంది. వీటి వినియో గంపై పౌరసరఫరాల శాఖ, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దృష్టి సారించకపోతే సబ్సిడీ సొమ్ము దుర్విని యోగం తప్పదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
కొత్త కనెక్షన్లు ఇవ్వక ఇబ్బందులు.
బుకింగ్ గడువుపై ఆంక్షలు సడలించినా, కొత్త గ్యాస్ కనెక్షన్ల విషయంలో స్పష్టత లేకపోవడం వినియోగదారు లను ఆందోళనకు గురిచేస్తోంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కొత్త కనెక్షన్ల మంజూరు నిలిచిపోయిందని ఏజెన్సీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో దాదాపు ఆరు నెలలుగా కొత్త కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. కొత్తగా వివాహమైన జంటలు, ఉమ్మడి కుటుం బాల నుంచి వేరుపడిన వారు, వలస కూలీలు గ్యాస్ కనెక్షన్ కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీలకు వెళ్లి అడిగితే ప్రభుత్వ ఆదేశాల మేరకు కొత్త కనెక్షన్లకు దరఖాస్తులు తీసుకోవడం లేదనే సమాధానం వస్తోంది. ఇప్పటికే గ్యాస్ వినియోగంపై ఆంక్షలు సడలించిన నేపథ్యంలో కొత్త కనె క్షన్లపై కూడా కేంద్రం నిర్ణయం తీసుకుని దరఖాస్తుల స్వీకరణ, మంజూరుకు అనుమతించాలని వినియోగదారులు కోరుతున్నారు.