మిషన్ భగీరథ పైపులైన్ల మరమ్మతు
ABN , Publish Date - Mar 20 , 2026 | 12:00 AM
రెండు నెలలుగా రోడ్ల నిర్మాణం లో భాగంగా పగిలిపోయిన మిషన్ భగీరథ పైపులైన్లను త్వరితగతిన మరమ్మతు చేయించాలని 29వ డివిజన్ కార్పొరేటర్ నిమ్మరాజుల రజని రవి ఇటీవల మేయర్ మహంకాళి స్వామి, కమిషనర్‌లకు వినతి పత్రాలు సమర్పించారు.
అంతర్గాం, మార్చి19(ఆంధ్రజ్యోతి): రెండు నెలలుగా రోడ్ల నిర్మాణం లో భాగంగా పగిలిపోయిన మిషన్ భగీరథ పైపులైన్లను త్వరితగతిన మరమ్మతు చేయించాలని 29వ డివిజన్ కార్పొరేటర్ నిమ్మరాజుల రజని రవి ఇటీవల మేయర్ మహంకాళి స్వామి, కమిషనర్‌లకు వినతి పత్రాలు సమర్పించారు. దీంతో స్పందించిన వారు సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడంతో గురువారం మరమ్మతు పనులు ప్రారంభించారు. కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రజలు మంచినీటి కోసం పడుతున్న ఇబ్బందులపై స్పందించిన మేయర్, కమిషనర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా 28, 29వ డివిజన్ కార్పొరేటర్లు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ ఇంచార్జి శశికుమార్, సిబ్బంది తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.