Share News

చారిత్రక కమాన్‌ తొలగించడం బాధాకరం

ABN , Publish Date - Nov 15 , 2026 | 10:53 PM

:పెద్దపల్లి పట్టణానికి దశాబ్దాలుగా చారిత్రక గుర్తింపుగా నిలిచిన కమాన్‌ను తొలగించడం బాధాకరమని ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పట్టణ కన్వీనర్‌ కుక్క శ్రావణ్‌ కుమార్‌ అన్నారు. ఆదివారం కమాన్‌ వద్ద నిరసన చేపట్టారు.

చారిత్రక కమాన్‌ తొలగించడం బాధాకరం

పెద్దపల్లి టౌన్‌, నవంబరు15 (ఆంధ్రజ్యోతి):పెద్దపల్లి పట్టణానికి దశాబ్దాలుగా చారిత్రక గుర్తింపుగా నిలిచిన కమాన్‌ను తొలగించడం బాధాకరమని ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పట్టణ కన్వీనర్‌ కుక్క శ్రావణ్‌ కుమార్‌ అన్నారు. ఆదివారం కమాన్‌ వద్ద నిరసన చేపట్టారు. ఆయన మాట్లాడుతూ నూతన కమాన్‌ నిర్మాణాన్ని స్వాగతిస్తున్నామని, అయితే ప్రజలకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా పాత కమాన్‌ను తొలగించడం సమంజసం కాదన్నారు. నూతన కమాన్‌ నమూనాను వెంటనే అధికారికంగా విడుదల చేయాలని, పట్టణ చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించేలా ఆధునిక హంగులతో నిర్మించాలని డిమాండ్‌ చేశారు. నిర్మాణ పనుల్లో నాణ్యత పాటిస్తూ త్వరగా పూర్తి చేయాలని, కమాన్‌ పరిసరాల్లో విశాలమైన సర్కిల్‌ ఏర్పాటు చేయాలని కోరారు. కుక్క అశోక్‌, నూనె వెంకటేష్‌, ఎం.డి. మెహరాజ్‌, షఫీ, చరణ్‌, ప్రేమ్‌, శ్రావణ్‌, తిరుమల్‌, రమేష్‌, అభినవ్‌, విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

బిజెపి ఆధ్వర్యంలో

పెద్దపల్లి పట్టణానికి చారిత్రక గుర్తింపుగా నిలిచిన సుమారు వందేళ్ల చరిత్ర కలిగిన కమాన్‌ను ముందస్తు సమాచారం లేకుండా తొలగించడం బాధాకరమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నల్ల మనోహర్‌ రెడ్డి అన్నారు. ఆదివారం పార్టీ కార్యకర్తలతో కలిసి కమాన్‌ చౌరస్తా వద్ద నిరసన చేపట్టారు. తొలగించిన స్థలంలో కాకతీయుల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా కమాన్‌ నిర్మించాలని డిమాండ్‌ చేశారు. ఆయన మాట్లాడుతూ పట్టణంలో పారిశుధ్య సమస్యలను పరిష్కరించడంలో మున్సి పల్‌ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. బైపాస్‌ రోడ్డు, కూనారం రైల్వే ఫ్లైఓవర్‌ పనులను వేగవంతం చేసి మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. నాయకులు కావేటి రాజగోపాల్‌, రాజం మహంత కృష్ణ, పిట్ట వినయ్‌, గద్దల రాజు, అమరబండ సతీష్‌, శేఖర్‌, ప్రదీప్‌, మల్లేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 15 , 2026 | 10:53 PM