Share News

స్తంభాలను తొలగించండి

ABN , Publish Date - Oct 23 , 2026 | 11:38 PM

రామగుండం కార్పొరేషన్‌లో రహదారులకు అడ్డుగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ స్తంభాలను పక్కకు తరలించాలని ఎన్‌పీడీసీఎల్‌ అధికారులకు రామగుండం మేయర్‌ మహంకాళి స్వామి సూచించారు.

స్తంభాలను తొలగించండి

కోల్‌సిటీ, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): రామగుండం కార్పొరేషన్‌లో రహదారులకు అడ్డుగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ స్తంభాలను పక్కకు తరలించాలని ఎన్‌పీడీసీఎల్‌ అధికారులకు రామగుండం మేయర్‌ మహంకాళి స్వామి సూచించారు. శుక్రవారం 49వ డివిజన్‌లో రూ.6కోట్ల ప్యాకేజీతో ఫైర్‌స్టేషన్‌ పక్క నుంచి శారదానగర్‌ ట్యాంకు వరకు నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ శారదానగర్‌ మెయిన్‌ రోడ్డు వరకు జరుగుతున్న రోడ్డు పనులతో ప్రభుత్వాసుపత్రికి, ఫైర్‌ స్టేషన్‌కు సులువుగా వెళ్లవచ్చనని, 20అడుగుల వరకు సీసీ రోడ్డును విస్తరించాలని సూచించారు. అత్య వసర పరిస్థితుల్లో అగ్నిమాపక వాహనాలు, 108 అంబులెన్స్‌ వెళ్లేం దుకు వీలుగా ఉంటుందని, ఇండ్ల ముందు ఎవరు ర్యాంపులు నిర్మించ వద్దని సూచించారు. విద్యుత్‌ తీగలపై ఉండే చెట్ల కొమ్మలను తొలగించాలని, శారదానగర్‌లో వివిధ ఏరియాల్లో చెత్త పేరుకుపోవడంతో అధికారులపై మేయర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజేష్‌ టాకీస్‌ వద్ద జరు గుతున్న జంక్షన్‌ వెడల్పు పనులను పరిశీలించారు. డిప్యూటీ మేయర్‌ పాతపెల్లి ఎల్లయ్య, కార్పొరేటర్‌ సాగి సంతోష్‌రావు, కార్పొరేటర్లు సాగి సంతోష్‌ రావు, గట్ల రమేష్‌, డేవిడ్‌ రాజ్‌, ట్రాన్స్‌కో ఏఈ గుండు శ్రీనివాస్‌, టీపీఓ నవీన్‌, నాయకులు తిప్పా రపు శ్రీనివాస్‌ ఉన్నారు.

Updated Date - Oct 23 , 2026 | 11:38 PM