Share News

కాలువలపై నిర్మించిన ఆక్రమణలు తొలగించండి

ABN , Publish Date - Apr 03 , 2026 | 12:07 AM

రామగుండం కార్పొరేషన్‌లో కాలువలపై వెలసిన ఆక్రమణలను తొలగించాలని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ అన్నారు. గురువారం మేయర్‌ మహంకాళి స్వామితో కలిసి 39వ డివిజన్‌ శివాజీనగర్‌, కూరగాయల మార్కెట్‌ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు.

కాలువలపై నిర్మించిన ఆక్రమణలు తొలగించండి

కోల్‌సిటీ, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): రామగుండం కార్పొరేషన్‌లో కాలువలపై వెలసిన ఆక్రమణలను తొలగించాలని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ అన్నారు. గురువారం మేయర్‌ మహంకాళి స్వామితో కలిసి 39వ డివిజన్‌ శివాజీనగర్‌, కూరగాయల మార్కెట్‌ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. ఆయన మాట్లాడుతూ బొందలగడ్డగా మారిన రామగుండంను నవ నిర్మాణం చేస్తున్న క్రమంలో కాలువలు సాఫీగా ప్రవహించేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. నగరాన్ని పరిశుభ్రంగా, స్వచ్ఛమైన నగరంగా రూపుదిద్దడానికి స్పెషల్‌ డ్రైవ్‌ను చేపడుతున్నట్టు చెప్పారు. వర్షాకాలంలోపు నగరంలోని అన్నీ ప్రధాన నాలాల పూడికను తొలగించాలని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగాలన్నారు. మేయర్‌ మాట్లాడుతూ పదేళ్లుగా కాలువల్లో పూడిక తొలగించకపోవడంతో వర్షాలు పడినప్పుడు వరద నీరు ఇండ్లలోకి చేరుతున్నాయని, కాలువల ప్రధాన పూడిక తీయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. మార్కెట్‌ను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి షాపు ఎదుట రెండు చెత్త డబ్బాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్పొరేటర్‌ తిప్పారపు మానస, నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్‌ నాయిని వెంకటస్వామి, ఎస్‌ఈ గురువీర్‌, ఈఈ రామన్‌, టీపీఎస్‌ నవీన్‌, ఏఈలు, డీఈలు పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2026 | 12:08 AM