Share News

కల్యాణలక్ష్మితో పేదలకు ఊరట

ABN , Publish Date - Oct 15 , 2026 | 11:34 PM

మండల కేంద్రంలోని ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌లో గురువారం సుల్తానాబాద్‌ పట్టణ, మండలం, ఎలిగేడు మండలాలకు చెందిన 140 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లబ్ధిదా రులకు చెక్కుల పంపిణీతోపాటు సుల్తానాబాద్‌ మున్సిపల్‌ కార్మికులకు దుస్తులను ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు పంపిణీ చేశారు.

కల్యాణలక్ష్మితో పేదలకు ఊరట

సుల్తానాబాద్‌, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌లో గురువారం సుల్తానాబాద్‌ పట్టణ, మండలం, ఎలిగేడు మండలాలకు చెందిన 140 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లబ్ధిదా రులకు చెక్కుల పంపిణీతోపాటు సుల్తానాబాద్‌ మున్సిపల్‌ కార్మికులకు దుస్తులను ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు పంపిణీ చేశారు. భూపతిపూర్‌ ఉపసర్పంచ్‌ కవ్వంపల్లి కార్తీక్‌ బిఆర్‌ఎస్‌ పార్టీని వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిం చారు. విప్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి పథ కాలను ప్రవేశపెట్టిందన్నారు. ఉచిత విద్యుత్‌, మహిళలకు బస్సు ప్రయా ణం, 500కు గ్యాస్‌ సిలిండర్‌, సన్న వడ్లకు బోనస్‌, ఇందిరమ్మ ఇండ్లు ఇలా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. రానున్న యాసంగిలో ఎట్టి పరిస్థితుల్లో వరి వేయవద్దని ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలాలు అడుగంటిపోయి పంటలు ఎండి పోయి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. వరికి బదలు ఆరుతడి పంటలు వేసి లబ్ధి పొందాలని సూచించారు. మున్సిపల్‌ చైర్మన్‌, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌, తహసీల్దార్‌, మున్సిపల్‌ కమిషనర్‌, సింగిల్‌ విండో చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, పాల్గొన్నారు.

Updated Date - Oct 15 , 2026 | 11:34 PM