సీఎంఆర్‌ఎఫ్‌తో పేదలకు ఊరట
ABN , Publish Date - Mar 14 , 2026 | 11:43 PM
పేద ప్రజలకు ఆస్పత్రి ఖర్చులకు సీఎం సహాయ నిధి ఎంతో ఊరట నిస్తుందని ఎమ్మెల్యే విజయరమ ణారావు తెలిపారు. ఆర్కే గార్డెన్‌లో శనివారం నియోజకవర్గంలోని 238 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ 75లక్షల 88వేల రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు.
పెద్దపల్లిటౌన్, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): పేద ప్రజలకు ఆస్పత్రి ఖర్చులకు సీఎం సహాయ నిధి ఎంతో ఊరట నిస్తుందని ఎమ్మెల్యే విజయరమ ణారావు తెలిపారు. ఆర్కే గార్డెన్‌లో శనివారం నియోజకవర్గంలోని 238 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ 75లక్షల 88వేల రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మె ల్యే మాట్లాడుతూ పేద ప్రజల వైద్య ఖర్చులకు సీఎం రిలీఫ్ ఫండ్ ఊరట కలుగుతుందన్నారు. పేదలు కడుపునిండా భోజనం చేయాలనే సదుద్దే శంతో పేదలు సన్న బియ్యంతో భోజనం చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సన్నబియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. మున్సిపల్ చైర్మన్లు మల్లయ్య, బిరుదు రాధాకృష్ణ, మార్కెట్ చైర్మన్, సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు లబ్ధిదారులు పాల్గొన్నారు.