రామగుండం ఎన్టీపీసీలో ఆర్‌ఈడీ పర్యటన
ABN , Publish Date - Feb 26 , 2026 | 12:01 AM
ఎన్టీపీసీ దక్షిణ రీజియన్ ఎగ్జిక్యూ టివ్ డైరెక్టర్ ఆరిందం సిన్హా బుధవారం రామగుండం, తెలంగాణ ఎన్టీపీసీ ప్రాజెక్టుల్లో పర్యటించారు. మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ఇక్కడికి చేరు కున్న ఆర్‌ఈడీ సిన్హాకు ప్రాజెక్టు ఈడీ చందన్ కుమార్ సామంత, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.
జ్యోతినగర్, ఫిబ్రవరి25(ఆంధ్రజ్యోతి): ఎన్టీపీసీ దక్షిణ రీజియన్ ఎగ్జిక్యూ టివ్ డైరెక్టర్ ఆరిందం సిన్హా బుధవారం రామగుండం, తెలంగాణ ఎన్టీపీసీ ప్రాజెక్టుల్లో పర్యటించారు. మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ఇక్కడికి చేరు కున్న ఆర్‌ఈడీ సిన్హాకు ప్రాజెక్టు ఈడీ చందన్ కుమార్ సామంత, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఆయన రెండు రోజుల పర్యటనలో భాగంగా రామగుండం ప్రాజెక్టులోని ఏడవ యూనిట్ కంట్రోల్ రూంను పరిశీలించారు. అనంతరం తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టులోని కంట్రోల్ రూములను పరిశీలించి అధికారులతో చర్చించారు. టీఎస్‌టీ పీపీలో నిర్వహించిన ఇండస్ర్టీయల్ క్యాంటీన్ భవనాన్ని ఆర్‌ఈడీ ప్రారం భించారు. ఎన్టీపీసీ పాలన భవనంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావే శాన్ని నిర్వహించారు. ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి, రక్షణ, పర్యావరణ పరిరక్షణ, తదితర విషయాలపై ఆర్‌ఈడీ దిశా నిర్దేశం చేశారు.