Share News

రికార్డులను సక్రమంగా నిర్వహించాలి

ABN , Publish Date - Jul 05 , 2026 | 11:44 PM

పోలీస్‌స్టేషన్‌ రికార్డులను ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా సూచించారు. ఆదివారం పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

రికార్డులను సక్రమంగా నిర్వహించాలి

ముత్తారం, జూలై 5 (ఆంధ్రజ్యోతి): పోలీస్‌స్టేషన్‌ రికార్డులను ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా సూచించారు. ఆదివారం పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డుల నిర్వహణ, ఫైళ్ల భద్రత, అడ్మినిస్ట్రేషన్‌ వ్యవహారాలను తనిఖీ చేశారు. రామ గుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా మాట్లాడుతూ స్టేషన్‌లో నమోదయ్యే ప్రతీ కేసు వివ రాలను, రికార్డులను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటి కప్పుడు అప్‌డేట్‌ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులు, ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని, వారికి న్యాయం జరిగేలా చొరవ చూపాలని స్పష్టం చేశారు. పల్లెల్లో ప్రజలను పట్టి పీడిస్తున్న వివిధ రకాల మూఢనమ్మకాల నిర్మూలనకు ప్రత్యేక నిఘా ఉంచాలని, పెరిగిపోతున్న ఆధునిక సైబర్‌ నేరాలపై ప్రజలను చైతన్య పరచా లన్నారు. రహదారి భద్ర తలో భాగంగా రోడ్లపై వాహనాల చెకింగ్‌ ప్రక్రి యను మరింత ముమ్మ రం చేయాలని, వాహన దారులు కచ్చితంగా అన్ని ఒరిజినల్‌ పత్రాలు కలిగి ఉండేలా అవగాహన కల్పించాలన్నారు. గోదా వరిఖని ఏసీపీ మడత రమేష్‌, మంథని సీఐ స్వామి, ముత్తారం ఎస్‌ఐ రవికుమార్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2026 | 11:44 PM