Share News

రికార్డు స్థాయిలో ఖని ఆర్‌టీసీ డిపో ఆదాయం

ABN , Publish Date - Sep 03 , 2026 | 11:54 PM

రాఖీపౌర్ణమి సందర్భంగా గోదావరిఖని ఆర్‌టీసీ డిపో అత్యధికంగా ఆక్యుపెన్సీ, రికార్డు స్థాయిలో ఆదాయాన్ని సాధించినందుకు గురువారం డిపోలో సిబ్బందికి డీఎం కవిత మిఠాయిలను పంపిణీ చేశారు. ప్రయాణికులకు అసౌకర్యం కలుగకుండా ప్రత్యేక బస్సులను నడుపుతూ ట్రాఫిక్‌ క్లియరెన్స్‌లో అంకితభావంతో పని చేసిన సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

రికార్డు స్థాయిలో ఖని ఆర్‌టీసీ డిపో ఆదాయం

కళ్యాణ్‌నగర్‌, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): రాఖీపౌర్ణమి సందర్భంగా గోదావరిఖని ఆర్‌టీసీ డిపో అత్యధికంగా ఆక్యుపెన్సీ, రికార్డు స్థాయిలో ఆదాయాన్ని సాధించినందుకు గురువారం డిపోలో సిబ్బందికి డీఎం కవిత మిఠాయిలను పంపిణీ చేశారు. ప్రయాణికులకు అసౌకర్యం కలుగకుండా ప్రత్యేక బస్సులను నడుపుతూ ట్రాఫిక్‌ క్లియరెన్స్‌లో అంకితభావంతో పని చేసిన సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. డీఎం మాట్లాడుతూ డిపోకు రికార్డు స్థాయిలో పండుగకు ఆదాయం వచ్చిందని, ప్రయాణికులకు మెరుగైన సేవలను అందిస్తూ సమిష్టి కృషితో పని చేయాలని పిలుపునిచ్చారు. రాఖీ పండుగ సందర్భంగా ఆగస్టు 27 నుంచి 31వరకు స్పెషల్‌ బస్సులను నడిపి 3.89 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చామని డీఎం తెలిపారు. 109ఆక్యుపెన్షన్‌ను సాధించి డిపోకు రూ.2.05కోట్ల ఆదాయంతో పాటు 2.89లక్షల కిలోమీటర్ల ప్రయాణించినట్టు తెలిపారు. మొత్తం 233 స్పెషల్‌ బస్సులను జేబీఎస్‌ హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాలకు నడిపామని, కరీంనగర్‌ రీజియన్‌లో గోదావరిఖని ఆర్‌టీసీ డిపో నెంబర్‌ వన్‌ స్థానంలో ఉందని డీఎం కవిత తెలిపారు.

Updated Date - Sep 03 , 2026 | 11:54 PM