Share News

కమ్యూనిటీ కాంటాక్ట్‌తో ప్రజలకు భరోసా

ABN , Publish Date - Jun 07 , 2026 | 11:53 PM

ప్రజ లు ఎలాంటి భయం లేకుండా ప్రశాంత వాతావరణంలో జీవిం చేందుకు భరోసా కల్పించడం పోలీసు శాఖ ప్రధాన బాధ్యత అని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అం బర్‌ కిశోర్‌ ఝా అన్నారు.

కమ్యూనిటీ కాంటాక్ట్‌తో ప్రజలకు భరోసా

కోల్‌సిటీ, జూన్‌ 7(ఆంధ్రజ్యోతి): ప్రజ లు ఎలాంటి భయం లేకుండా ప్రశాంత వాతావరణంలో జీవిం చేందుకు భరోసా కల్పించడం పోలీసు శాఖ ప్రధాన బాధ్యత అని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అం బర్‌ కిశోర్‌ ఝా అన్నారు. గోదావరిఖని వన్‌టౌన్‌ పరిధిలోని కేసీఆర్‌ కాలనీలో శనివారం రాత్రి కమ్యూ నిటీ కాంటాక్ట్‌ కార్యక్రమం నిర్వహించారు. ఏసీపీ రమేష్‌, వన్‌టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇంద్రసేనారెడ్డి, అఫ్జ లోద్దీన్‌ పాల్గొన్నారు. గంజాయి అక్రమ రవాణా, నిల్వ, సరఫరాపై ప్రత్యేక నిఘాతోపాటు అనుమానా స్పద ప్రాంతాలు, నివాస గృహాల్లో తనిఖీలు నిర్వ హించారు. తనిఖీల్లో పత్రాలు లేని 51 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీస్‌ కమిష నర్‌ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు, అనుమానాస్పద వ్యక్తు ల గురించి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. మహిళలతో డయ ల్‌ 100కు కాల్‌ చేయించి పోలీసుల స్పందన తీరును ప్రత్యక్షంగా ప్రదర్శించారు. సీపీ మాట్లాడుతూ కమ్యూనిటీ కాంటాక్ట్‌ కార్యక్రమాల ద్వారా అను మానాస్పద వ్యక్తులు, రౌడీషీటర్లు, పాత నేరస్తులను గురించి, వారి వివరాలు, వేలిముద్రలను సేకరి స్తున్నామని తెలిపారు. దీంతో వారు ఎక్కడైనా నేరా లకు పాల్పడితే సులభంగా గుర్తించే అవకాశం ఉం టుందన్నారు. మహిళలు, యువత, చిన్నారులతో మాట్లాడటం ద్వారా వారి ఆలోచనలు, అవసరాలను తెలుసుకొని మార్గనిర్దేశం చేయగలుగుతామని తెలి పారు. ఇతర ప్రాంతాలు లేదా రాష్ట్రాలకు చెందిన వ్యక్తులకు ఇళ్లు అద్దెకు ఇచ్చినా, ఉద్యోగాల్లో నియ మించినా వారి వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఎలాంటి సమస్య ఎదురైనా డయల్‌ 100కు కాల్‌ చేయాలని లేదా సమీప పోలీస్‌ స్టేష న్‌లో సంప్రదించాలని ప్రజలకు సూచించారు. సీఐ కృష్ణకుమార్‌, కమాన్‌పూర్‌ ఎస్‌ఐ ప్రసాద్‌, వన్‌టౌన్‌ ఎస్‌ఐలు రమేష్‌, మనోహర్‌, అనూషతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jun 07 , 2026 | 11:53 PM