ఇందిరమ్మ పథకంతో సొంతింటి కల సాకారం
ABN , Publish Date - Apr 13 , 2026 | 12:25 AM
ఇందిరమ్మ పథకంతో పేదవారి సొంతింటి కల సాకారమైందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. ఆదివారం బుర్హాన్‌మియా పేట్, నర్సాపూర్ గ్రామాల్లో మొదటి విడత ఇందిరమ్మ గృహాలు నిర్మించుకున్న లబ్ధిదారుల గృహ ప్రవేశాలను ఆయన ఆదివారం ప్రారంభించారు.
ఎలిగేడు, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ పథకంతో పేదవారి సొంతింటి కల సాకారమైందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. ఆదివారం బుర్హాన్‌మియా పేట్, నర్సాపూర్ గ్రామాల్లో మొదటి విడత ఇందిరమ్మ గృహాలు నిర్మించుకున్న లబ్ధిదారుల గృహ ప్రవేశాలను ఆయన ఆదివారం ప్రారంభించారు. ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికి, శాలువాలతో సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా గుజ్జుల రవళి విజేందర్ రెడ్డి, బొంగోని రమ సంపత్, గుజ్జుల లావణ్య ప్రశాంత్ రెడ్డి, నర్సాపూర్‌లో పోరండ్ల పద్మ నిర్మించుకున్న ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేరుతున్నాయన్నారు. బుర్హాన్‌మియాపేటలో రూ.10 లక్షలతో అంతర్గత సీసీ రోడ్డును ప్రారంభించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇందిరమ్మ పథకం ద్వారా లబ్ధిదారులకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం చేసిందన్నారు. గత బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ఏ ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన పాపాన పోలేదన్నారు. ఉచిత విద్యుత్, రేషన్ కార్డుల జారీ, సన్నబియ్యం, ఉచిత బస్సు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌తోపాటు మరిన్ని పథకాలను అందిస్తున్నామన్నారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ద్వారా ఆర్థిక సహాయం, ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు ఆల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాలు అమలులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. పార్టీ మండల అధ్యక్షుడు సామ రాజేశ్వర్‌రెడ్డి, యువజన రాష్ట్ర కార్యదర్శి దుగ్యాల సంతోష్ రావు, జిల్లా ఉపాధ్యక్షుడు అర్షణపల్లి వెంకటేశ్వర్‌రావు, సర్పంచ్‌లు గోపు రజిత లక్ష్మారెడ్డి, పల్లెర్ల వెంకటేష్ గౌడ్, కప్పల ప్రవీణ్, సిద్ది తిరుపతి, ఏలేటి వెంకట్ రెడ్డి, మద్దెల రమాదేవి, హౌసింగ్ ఏఈ సాహిత్య, నాయకులు గోదెల సాయినాథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, నాయకులు కోరుకంటి వెంకటేశ్వర్‌రావు, కొండ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.