అర్హులందరికీ రేషన్‌కార్డులు
ABN , Publish Date - Aug 16 , 2026 | 12:21 AM
అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందించడంతో పాటు పేదలకు నాణ్యమైన సన్నబియ్యం అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం కలెక్టరేట్‌లో కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
పెద్దపల్లి, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందించడంతో పాటు పేదలకు నాణ్యమైన సన్నబియ్యం అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం కలెక్టరేట్‌లో కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ముఖ్యమంత్రి రేవం త్‌రెడ్డి సంగారెడ్డి జిల్లా నుంచి ప్రారంభిం చారని తెలిపారు. గతంలో పుస్తకం రూపంలో ఉన్న రేషన్ కార్డుల స్థానంలో సులభంగా వెంట తీసుకెళ్లేలా స్మార్ట్ కార్డులను రూపొం దించినట్లు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డులు లేక అనేక కుటుం బాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయని, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులకు కొత్త కార్డులు మంజూరు చేయడం తోపాటు పాత కార్డుల్లో కొత్త లబ్ధిదారులను చేర్చినట్లు వివరించారు. జిల్లాలో 2,46,157 కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో పేదలకు రేషన్ షాపుల ద్వారా నాణ్యమైన సన్నబియ్యం అందిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యం పథకం దుర్విని యోగం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. మార్కెట్‌లో కిలో సుమారు రూ.60 విలువ చేసే నాణ్యమైన సన్నబియ్యాన్ని ప్రభుత్వం రైతుల నుంచే కొనుగోలు చేస్తోందన్నారు. సన్నవడ్లకు క్వింటా ల్‌కు రూ. 500 బోనస్ చెల్లిస్తోందని, రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.1050 కోట్ల మేర బోనస్ చెల్లింపులు జరుగుతున్నాయని తెలిపారు. పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలోనే రైతులకు సుమారు రూ.60 కోట్ల బోనస్ అందిందన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ జిల్లాలో 30 వేలకు పైగా కొత్త రేషన్ కార్డులు మం జూరు చేశామని తెలిపారు. రేషన్ కార్డుల మంజూరు నిరంతర ప్రక్రియ అని, అర్హులైన వారు మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. స్మార్ట్ రేషన్ కార్డులను టీ-రేషన్ యాప్‌తో అనుసంధానం చేయనున్నామని, హోలోగ్రామ్, క్యూఆర్ కోడ్‌తో కూడిన కార్డులను ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. అనంతరం కులాంతర వివాహాలు చేసుకున్న 116 జంటలకు రూ.2.50 లక్షల చొప్పున ప్రోత్సాహక ఫిక్స్‌డ్ డిపాజిట్ బాండ్లను పంపిణీ చేశారు. అదనపు కలెక్టర్ శ్రీరాములు, పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శ్రీనాథ్, పౌరసరఫరాల మేనేజర్ శ్రీకాంత్, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రవీం దర్, అధికారులు, తహసీల్దార్లు, పాల్గొన్నారు.