రామగుండం-మణుగూరు రైల్వేలైన్‌ను గడువులోగా పూర్తిచేయాలి
ABN , Publish Date - Jun 20 , 2026 | 12:12 AM
కేంద్ర ప్రభుత్వం రామగుం డం నుంచి మణుగూరు వరకు నిర్మిస్తున్న రైల్వే లైన్ పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు.
గోదావరిఖని, జూన్ 19(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం రామగుం డం నుంచి మణుగూరు వరకు నిర్మిస్తున్న రైల్వే లైన్ పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. శుక్రవారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో జరి గిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రామగుండం- మణుగూరు రైల్వేలైన్ పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రికొత్తగూడెం మీదుగా మణుగూరుకు నిర్మించనున్న ఈ రైల్వే లైన్‌కు రూ.5818కోట్లు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిం దన్నారు. ఐదు సంవత్సరాలలో పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసిం దని, రైల్వేలైన్ రాఘవాపూర్ నుంచి కాకుండా పోతనకాలనీ, యైుటిం క్లయిన్‌కాలనీ, మంథని, భూపాలపల్లి, మేడారం, తడ్వాయి గుండా నిర్మించడం వల్ల మారుమూలు ప్రాంత ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. పెద్దపల్లి నుంచి నిర్మించడం వల్ల ప్రయాణికులు కష్టాలు పడాల్సి వస్తుందని, యైుటింక్లయిన్ మీదుగా నిర్మిస్తే ప్రజలకు అనువుగా ఉంటుందన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ బాధ్యత తీసుకుని యైుటిం క్లయిన్‌కాలనీ మీదుగా నిర్మించే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్పొరేటర్లు మేకల సమ్మయ్య యాదవ్, తాళ్ల రాజయ్య, బీఆర్‌ఎస్ నాయకులు గుంపుల లక్ష్మి, దొమ్మేటి వాసు, సట్టు శ్రీనివాస్, పాలడుగు కనకయ్య పాల్గొన్నారు.