Share News

రామగుండాన్ని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలి

ABN , Publish Date - Jul 09 , 2026 | 11:40 PM

రామగుండాన్ని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని గురువారం రామగుండం స్వచ్ఛంద సంస్థల ఐక్యవేదిక ప్రతినిధులు మద్దెల దినేష్‌ ఆధ్వర్యంలో గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

రామగుండాన్ని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలి

కళ్యాణ్‌నగర్‌, జూలై 9(ఆంధ్రజ్యోతి): రామగుండాన్ని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని గురువారం రామగుండం స్వచ్ఛంద సంస్థల ఐక్యవేదిక ప్రతినిధులు మద్దెల దినేష్‌ ఆధ్వర్యంలో గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం ప్రజల పరిపాలన సౌలభ్యం కోసం నూతన జిల్లాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం గోదావరిఖని ప్రధాన పారిశ్రామిక ప్రాంత ప్రజల అవసరాలను విస్మరించిందని, అన్నీ అర్హతలు, రవాణా సౌకర్యాలు ఉన్నప్పటికీ స్వార్థ రాజకీయాల కారణంగా గోదావరిఖనికి దక్కాల్సిన జిల్లా కేంద్రం హోదా పెద్దపల్లికి వెళ్లిపోయిందన్నారు. రామగుండంను రెవెన్యూ డివిజన్‌గా అభివృద్ధి చేస్తామని పాలకులు ఇచ్చిన హామీ అమలు కాలేదని, రామగుండం నియోజకవర్గంలోని 60డివిజన్లలో 2లక్షల మంది నివసిస్తున్నారని, గోదావరిఖని పట్టణంలో అర్బన్‌ తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని, దీని వల్ల పరిపాలన సౌలభ్యం సులభమవుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రామగుండంను రెవెన్యూ డివిజన్‌గా, గోదావరిఖనిలో అర్బన్‌ తహసిల్దార్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్నారు. దుర్గం నగేష్‌, ఐత శివ కుమార్‌, చంద్రకళ, రవి, కంది సుజాత, సరిత, లక్ష్మి, శిరీష, రమాదేవి, సుశీల, శ్రీనివాస్‌, మల్లేష్‌, శివ, లెనిన్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 09 , 2026 | 11:40 PM