Share News

రామగుండం నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా

ABN , Publish Date - Nov 02 , 2026 | 11:39 PM

రామగుం డం నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యమని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ అన్నారు. ఉదయ్‌నగర్‌లో రూ.20లక్షలతో ఏర్పాటు చేసిన పార్కును ప్రారంభించారు.

రామగుండం నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా

కళ్యాణ్‌నగర్‌, నవంబర్‌ 2 (ఆంధ్రజ్యోతి): రామగుం డం నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యమని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ అన్నారు. ఉదయ్‌నగర్‌లో రూ.20లక్షలతో ఏర్పాటు చేసిన పార్కును ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడంతో పాటు వాకింగ్‌ చేసేందుకు వాకర్స్‌కు ప్రత్యేక వాకింగ్‌ ట్రాక్‌ను, పిల్లలు ఆటలు ఆడుకునేందుకు ఆట వస్తువులు ఏర్పాటు చేశామన్నారు. పట్టణ ప్రజల ఆరోగ్యం, ఆహ్లాదాన్ని దృష్టిలో ఉంచుకుని పార్కుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత రామగుండం కార్పొరేషన్‌ అభివృద్ధికి రూ.800కోట్ల నిధులను తీసుకువచ్చినట్టు, కార్పొరేష న్‌లలో 60డివిజన్లలో మంచినీటి సదుపాయం, రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్‌ దీపాలను ఏర్పాటు చేశామని, రోడ్లను విశాలంగా తీర్చిదిద్దడంతో పాటు సింగరేణి ఆధ్వర్యంలో చౌరస్తాలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణాలను పూర్తిచేసి త్వరలోనే ప్రారంభించనున్నట్టు ఎమ్మెల్యే చెప్పారు. మేయర్‌ మహంకాళి స్వామి, ఆర్‌జీ-1 జీఎం లలిత్‌కుమార్‌, డిప్యూటీ మేయర్‌ పాతపెల్లి ఎల్లయ్య, డీవైజీఎం కరుణ, డీవైజీఎం వరప్రసాద్‌, ఎస్‌ఓటూ జీఎం చంద్రశేఖర్‌, కార్పొరేటర్లు వేగోళపు రమాదేవి, కంకణాల మౌనిక, దాసరి సాంబమూర్తి, నాయకులు వంగ శ్రీనివాస్‌, నజీమోద్దీన్‌, గడ్డం శ్రీనివాస్‌, దాసరి విజయ్‌, సింగరేణి శ్రీనివాస్‌, దాసరి ఉమాదేవి పాల్గొన్నారు.

Updated Date - Nov 02 , 2026 | 11:39 PM