రాజీవ్ రహదారి నిర్వహణ అస్తవ్యస్తం
ABN , Publish Date - Apr 04 , 2026 | 11:29 PM
రాజీవ్ రహదారి నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. అక్కడక్కడ ఏర్పడ్డ గుంతలు సకాలంలో పూడ్చక పోవడంతోపాటు రోడ్డు మధ్యలో గల డివైడర్‌లో మొక్కలు నాటని కారణంగా తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల వల్ల ఇప్పటికే పలువురు మృతి చెందగా, పలువురు అంగవైకల్యం పొంది మంచాన పడ్డారు.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
రాజీవ్ రహదారి నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. అక్కడక్కడ ఏర్పడ్డ గుంతలు సకాలంలో పూడ్చక పోవడంతోపాటు రోడ్డు మధ్యలో గల డివైడర్‌లో మొక్కలు నాటని కారణంగా తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల వల్ల ఇప్పటికే పలువురు మృతి చెందగా, పలువురు అంగవైకల్యం పొంది మంచాన పడ్డారు. కాంట్రాక్టర్లు టోల్ గేట్ల ద్వారా డబ్బులు వసూలులో చూపుతున్న శ్రద్ధ రోడ్డు నిర్వహ ణపై చూపడం లేదనే విమర్శలున్నాయి. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాల్సిన స్టేట్ హైవే అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ ఓటర్ రింగ్ రోడ్డు శామీర్‌పేట్ నుంచి సిద్ధిపేట, కరీంనగర్, పెద్దపల్లి, రామగుండం మీదుగా మంచిర్యాల జిల్లా ఇందారం వరకు 207 కిలోమీటర్ల దూరం వరకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణాన్ని 2007లో 1400 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టారు. పూర్తిస్థాయిలో ఈ రహదారి 2014లో అందుబాటులోకి వచ్చింది. డిజైన్ బిల్డ్ ఫైనాన్స్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్ (డీబీఓటీ) పద్ధతిలో నిర్మించారు. మొత్తం 25 సంవత్సరాలపాటు 2039 వరకు టోల్ వసూలు చేసుకునేలా హెచ్‌కేఆర్ రోడ్ వేస్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నది. ఇందుకోసం పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్, కరీంనగర్ జిల్లా రేణిగుంట, సిద్ధిపేట జిల్లా దుద్దెడ వద్ద మూడు టోల్ గేట్లను ఏర్పాటు చేశారు. ఈ మూడు టోల్ గేట్ల మీదుగా వెళ్లే నాలుగు చక్రాలు, ఆపైన చక్రాలు గల వాహనాల నుంచి టోల్ వసూలు చేస్తున్నారు. టోల్ గడువు ముగిసే వరకు రాజీవ్ రహదారి నిర్వహణ అంతా హెచ్‌కెఆర్ సంస్థ చూసుకోవాల్సి ఉంటుంది. ప్రతీ మూడు, నాలుగేళ్లకోసారి రహదారి పొడవునా బీటీ రెన్యూవల్ చేస్తున్న సంస్థ రోడ్డుకు ఇరుపక్కలా ఎప్పటికప్పుడు సైడ్ బర్మ్స్ లెవెల్ చేయడం లేదు. ప్రధానంగా రోడ్డు మఽధ్యలో గల మూడు అడుగుల వెడల్పు గల డివైడర్‌లో మొక్కలు సక్రమంగా నాటడం లేదు. రోడ్డు నిర్మాణ సమయంలో డివైడర్ మధ్యలో కాంట్రాక్టర్లు గన్నేరు పూల మొక్కలను నాటారు. అప్పటి నుంచి సక్రమంగా మొక్కలు నాటిన దాఖలాలు లేవు. డివైడర్ల మధ్యలో మట్టి కొట్టుకుపోగా, చాలా చోట్ల మొక్కలు ఎండిపోయాయి. రామగుండం నుంచి మొద లుకుని సిద్ధిపేట జిల్లా సరిహద్దు వరకు డివైడర్లలో చాలా వరకు మొక్కలు ఎండిపోయి బోసిపోయి కనబ డుతున్నాయి. రాత్రి వేళలో ఎదురెదురుగా వచ్చే వాహ నాల లైట్లు ఎదుటి వాహనాల డ్రైవర్లపై పడకుండా డివైడర్ల మధ్య మొక్కలు నాటారు. దీంతో ప్రమాదాలు పెద్దగా జరిగేవి కావు. ఎండిపోయిన మొక్కల స్థానంలో ఎర్ర మట్టి పోసి ఎప్పటికప్పుడు మొక్కలు నాటాల్సిన కాంట్రాక్టర్లు పట్టించుకోవడం లేదు. అక్కడక్కడ ఉన్న మొక్కల సంరక్షణకు నీళ్లు పోయడం లేదు. దీంతో రాత్రి వేళల్లో పలు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎదురుగా వస్తున్న లైట్ల ఫోకస్‌కు ఒక్కోసారి డ్రైవర్లకు డివైడర్లు కనబడక వాటిని ఢీకొట్టడం, వాటిపై నుంచి వెళ్లి అవతలి వైపు నుంచి వస్తున్న వాహనాలను ఢీకొట్టిన సంఘటలు కోకోల్లలు. రాత్రి వేళలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఎంతగానో ఉపయోగపడే మొక్కలపై కాంట్రాక్టర్లు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నా స్టేట్ హైవే అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు న్నాయి. ఆయా పట్టణాలు, గ్రామాలు వచ్చిన చోట గత ప్రభుత్వ హయాంలో డివైడర్ల ఎత్తు పెంచి వాటిలో పెద్ద పెద్ద మొక్కలు స్థానిక రోడ్డు భవనాల శాఖాధి కారులు నాటించారు. రోడ్డు పొడవునా ఉన్న డివైడర్లలో మొక్కలు ఎండిపోయిన చోట నాటించక పోవడం దారుణమని వాహనదారులు అంటున్నారు. మొక్కలు నాటకుండా వాహన చోదకుల ప్రాణాలు తీస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రోడ్లు భవ నాల శాఖ మంత్రి స్పందించి రాజీవ్ రహదారి డివైడ ర్లలో మొక్కలు నాటించి రోడ్డు నిర్వహణ సక్రమంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.