Share News

రాజన్న సిరిసిల్ల : ఈసారైనా.. వికసించేనా?

ABN , Publish Date - Oct 25 , 2026 | 12:37 AM

నిరుద్యోగ యువతీ, యువకుల్లో ఆశలు కల్పించి నిరీక్షణను మిలిగించిన రాజీవ్‌ యువ వికాస పథకం అమలుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో రాజీవ్‌ యువవికాసం పథకానికి సంబంధించిన దరఖాస్తుదారుల్లో అర్హులను గుర్తించి మొదటి విడత రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో నిరుద్యోగుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి.

రాజన్న సిరిసిల్ల :  ఈసారైనా.. వికసించేనా?

(ఆంరఽధజ్యోతి, సిరిసిల్ల)

నిరుద్యోగ యువతీ, యువకుల్లో ఆశలు కల్పించి నిరీక్షణను మిలిగించిన రాజీవ్‌ యువ వికాస పథకం అమలుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో రాజీవ్‌ యువవికాసం పథకానికి సంబంధించిన దరఖాస్తుదారుల్లో అర్హులను గుర్తించి మొదటి విడత రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో నిరుద్యోగుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. ఈ సంవత్సరం జూన్‌2 తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రుణాలు అందిస్తామని ప్రకటించిన చివరి క్షణంలో వాయిదాపడి నిరాశ మిగిల్చింది. మరో సారి అక్టోబర్‌ చివరి వారంలో ప్రక్రియ ప్రారంభించి నవంబర్‌లో మొదటి విడతలో రూ.50 వేలు, రూ లక్ష అందించాలని, రెండో విడతలో పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. స్వయం ఉపాధి ఆశతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజికవర్గాల నుంచి 36819దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తులను పరిశీలించి అర్హులను ఎంపిక చేసిన క్రమంలోని ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేయాలంటూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో లబ్ధిదారుల ఎంపిక నిలిచిపోయింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం లేకపోవడంతో పథకం అమలులో సందిగ్ధత నెలకొంది. పథకంలో రూ.50వేలు, రూ.లక్ష, రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల రుణాలు అందిస్తుండగా రూ.50వేల వరకు వంద శాతం సబ్సిడీ రాయితీ, రూ.50 నుంచి రూ.లక్ష వరకు 90 శాతం సబ్సిడీ రాయితీ కాగా పదిశాతం లబ్ధిదారుడు చెల్లించాల్సి ఉంటుంది. రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు 80శాతం రాయితీ, 20శాతం రుణం, రూ.2 నుంచి 4లక్షల వరకు 70శాతం సబ్సిడీ 30శాతం రుణంగా అందించే విధంగా నిర్లయించింది. ప్రభుత్వం అందించే యూనిట్లలో పౌల్ర్టీ, బ్యాగుల తయారీ, కొబ్బరిబొండాల దుకాణాలు, బ్యాంగిల్‌ స్టోర్‌, డెయిరీ ఫాం, ఎలక్ర్టికల్‌, మినీ సూపర్‌బజార్‌, స్పింకర్లు, డ్రిప్‌ ఇరిగేషన్‌, గొర్రెలు, సెలూన్‌, బ్యూటీ పార్లర్‌, హార్డ్‌వేర్‌, మెడికల్‌ దుకాణాలు ఇల పలు యూనిట్లను నిర్ణయించారు. 17నెలలుగా దరఖాస్తులు చేసుకొని రుణాల కోసం నిరుద్యోగ యువత నిరీక్షిస్తున్నది.

జిల్లాలో 7680 యూనిట్లు.. 7121మంది అర్హుల ఎంపిక..

జిల్లాలో రాజీవ్‌ యువవికాసం పథకానికి 36819దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఎస్సీ కార్పొరేషన్‌కు 8865 దరఖాస్తులు, ఎస్టీ కార్పొరేషన్‌కు 1943దరఖాస్తులు, బీసీ కార్పొరేషన్‌కు 23243దరఖాస్తులు, మైనార్టీ కార్పొరేషన్‌కు 1606దరఖాస్తులు, క్రిస్టియన్‌ మైనార్టీ కార్పొరేషన్‌కు 39దరఖాస్తులు, ఈబీసీ దరఖాస్తులు 1123వచ్చాయి. దరఖాస్తులను మండల కేంద్రాలు, మున్సిపల్‌ కార్యాలయాల్లో పరిశీలించారు. జిల్లాలో 7680యూనిట్లకు రుణాల పంపిణీ లక్ష్యం కాగా 7121మంది అర్హులను ఎంపిక చేశారు. రూ.50వేల వరకు 2464యూనిట్లకు గాను 2148 మంది అర్హులుగా గుర్తించారు. రూ.50వేల నుంచి లక్ష వరకు 1876యూనిట్లకు గాను 1771మంది అర్హులు, రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు 1642యూనిట్లకు గాను 1587మంది అర్హులుగా, రూ.2లక్షలనుంచి రూ.3లక్షల వరకు 372 యూనిట్లుకు గాను 372మంది అర్హులు, రూ.2లక్షల నుంచి రూ.4లక్షల వరకు 941యూనిట్లకు గాను 924మంది అర్హులు, రూ.3లక్ష లనుంచి రూ.4లక్షల వరకు 308యూనిట్లకు గాను 308మంది అర్హులు 43బోర్‌వెల్‌ యూనిట్లకు 8 మంది అర్హులు. ఎనర్జీ ఓఆర్‌సీ 32యూనిట్లకు ఇద్దరు అర్హులు, సోలార్‌ ప్యానెల్‌ ఫర్‌ బోర్‌వెల్‌కు 2యూనిట్లకు ఒక్కరు అర్హులుగా గుర్తించారు. ఇందులో దివ్యాంగులకు 5శాతం,మహిళలకు 25శాతం కేటాయించారు. యువత సొంతగా చిరువ్యాపారాల వైపు అడుగువేసి ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాకుండా సులువుగా ఆర్థికసాయం అందుతుందని భావించినా వికాసం నిరీక్షణ మిగిల్చింది.

జిల్లాలో మంజూరైన యూనిట్లు... లబ్ధిదారులు

కార్పొరేషన్‌ లక్ష్యం అర్హులు

ఎస్సీ 2734 2668

ఎస్టీ 662 522

బీసీ 3193 3193

ఈబీసీ 817 504

మైనార్టీ 221 221

క్రిస్టియన్‌ మైనార్టీ 53 13

------------------------------------------------------------------------------

మొత్తం 7680 7121

--------------------------------------------------------------------------

జిల్లాలో వచ్చిన రాజీవ్‌ యువ వికాసం పథకానికి వచ్చిన దరఖాస్తులు

మండలం ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనార్టీ క్రిస్టియన్‌ మొత్తం

బోయినపల్లి 678 17 1235 21 22 02 1975

చందుర్తి 458 49 1044 50 40 04 1645

ఇల్లంతకుంట 1017 34 2199 149 63 01 3463

గంభీరావుపేట 822 214 1940 94 250 00 3320

కోనరావుపేట 563 169 1770 47 97 05 2751

ముస్తాబాద్‌ 1068 154 1990 136 150 01 3499

రుద్రంగి 108 214 431 23 27 00 803

సిరిసిల్ల మున్సిపల్‌ 514 82 5032 94 374 03 6099

తంగళ్లపల్లి 770 20 2119 129 81 01 3120

వీర్నపల్లి 279 499 433 20 15 05 1251

వేములవాడ రూరల్‌ 434 29 791 14 21 00 1289

వేములవాడ అర్భన్‌ 409 63 786 19 26 05 1308

వేములవాడ మున్సిపల్‌ 585 58 1718 133 245 05 2744

ఎల్లారెడ్డిపేట 860 341 1955 194 195 07 3552

------------------------------------------------------------

మొత్తం 8865 1943 23243 1123 1606 39 36819

----------------------------------------------------------

Updated Date - Oct 25 , 2026 | 12:37 AM