ఇంటర్ విద్యలో సమూల మార్పులు..
ABN , Publish Date - May 28 , 2026 | 11:52 PM
ఉన్నత విద్యాభ్యాసానికి టర్నింగ్ పాయింట్ అయిన ఇంటర్మీడియెట్ విద్యలో మారుతున్న కాలానికి అనుగు ణంగా సమూల మార్పులు తీసుక వచ్చేందుకు ప్రభు త్వం సన్నాహాలు చేసింది. కొన్నేళ్ళుగా అమల్లో ఉన్న పాత విధానాలకు స్వస్తి పలికింది. విద్యార్థుల్లో పఠనా సక్తి, సృజనాత్మకత, కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెం చేలా ఇంటర్ సిలబస్‌లో మార్పులు తీసుకువచ్చింది.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
ఉన్నత విద్యాభ్యాసానికి టర్నింగ్ పాయింట్ అయిన ఇంటర్మీడియెట్ విద్యలో మారుతున్న కాలానికి అనుగు ణంగా సమూల మార్పులు తీసుక వచ్చేందుకు ప్రభు త్వం సన్నాహాలు చేసింది. కొన్నేళ్ళుగా అమల్లో ఉన్న పాత విధానాలకు స్వస్తి పలికింది. విద్యార్థుల్లో పఠనా సక్తి, సృజనాత్మకత, కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెం చేలా ఇంటర్ సిలబస్‌లో మార్పులు తీసుకువచ్చింది. నూతన అంశాలు, సాంకేతిక పరిజ్ఞానం, ప్రాక్టికల్ లెర్నింగ్ విధానాలతో పాఠ్యాంశాలను తీర్చిదిద్దారు. ప్రాజెక్టు ఆధారిత బోధనతోపాటు క్యూఆర్ కోడ్, ఇంట ర్నల్ మార్కులు, డూయూనో (మీకు తెలుసా) అంటూ ఆసక్తికర అంశాలతో ప్రత్యేక బాక్స్ వంటి ఆకట్టుకునే అంశాలను కొత్త సిలబస్‌లో చేర్చారు. ఈ విద్యా సంవ త్సరం నుంచే ఈ సిలబస్ అమలులోకి రానుండగా ఇది గ్రామీణ విద్యార్థులకు డిజిటల్ లెర్నింగ్‌పై అవగాహన పెరిగే అవకాశ ఉంది.
సిలబస్‌లో మార్పులు..
ఇంటర్ ఇంగ్లీష్ సబ్జెక్టులో పాఠ్య పుస్తకాన్ని సమగ్రంగా మార్చారు. అలాగే తెలుగు పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ సంస్కృతి, పండుగలు, జానపద కళలు, ప్రముఖ వ్యక్తుల చరిత్రకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇక గణితంలో ప్రముఖ భారతీయ గణిత శాస్త్రవేత్తల పరిచయ అంతర్జాతీయ ప్రమాణాల ఆధారిత కార్యకలా పాలు, క్యూఆర్ కోడ్‌లు చేర్చారు. పేజీలను గణనీయం గా తగ్గించారు. భౌతికశాస్త్రం పుస్తకాల్లో ఫిజిక్స్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనే కొత్త పాఠాన్ని ప్రవేశ పెట్టారు. దీంతో విద్యార్థులకు కృత్రిమమేద, రోబోటిక్స్ పునరుత్పాదక శక్తి, అంతరిక్ష విజ్ఞానం, కమ్యూనికేషన్లపై అవగాహన కలగనుంది. జాగ్రఫీలో సిలబస్‌ను 6 యూనిట్లుగా కుదించారు. రసాయన వృక్ష, జంతు శాస్త్ర పుస్తకాలను మారిన ప్రమాణాలకు అనుగుణంగా కొత్త పదాలు, కొత్త అధ్యాయాలు, చిత్రాలు, శాస్త్రవేత్తల వివరాలు చేర్చడం ద్వారా పాఠ్యాంశాలను మరింత సులభతరం చేశారు. ఇలా ఇంటర్ విద్యలో సమూల మార్పులు చోటు చేసుకోగా ఇది విద్యార్థులకు మరింత సులభంగా అర్థమయ్యేలా ప్రయోజనం కలగనుంది.
ఫస్టియర్ నుంచే ప్రాక్టికల్స్
ఇంటర్ విద్యలో ఇంతకాలం ఎంపీసీ, బైపీసీ విభాగాల్లో ద్వితీయ సంవత్సరానికి మాత్రమే ప్రాక్టికల్స్ ఉండేవి. కానీ ప్రస్తుతం ఫస్టియర్ నుంచే ప్రాక్టికల్స్ ప్రవేశపెట్టారు. భౌతిక రసాయన శాస్త్రాల్లో వీటికి 15 మార్కుల చొప్పున ఉంటాయి. అంతేకాకుండా ప్రతీ సబ్జెక్టులో కొత్తగా ఇంటర్నల్ అసైన్‌మెంట్ కింద విద్యా ర్థుల సామర్ధ్యాలకు అనుగుణంగా 20 మార్కులు కేటా యిస్తారు. తెలుగు, ఉర్దూ, సంస్కృతం, హిందీ, అరబిక్, ఫ్రెంచ్, మరాఠీ భాషా శాస్త్రాల్లోను ఇంటర్నల్ మూల్యాంకనం కింద 20 మార్కులు ఇస్తారు. ఫిజిక్స్‌లో 20 మార్కులు, రసాయన, వృక్ష జంతు శాస్త్రాల్లో 15 చొప్పున, ఎకనామిక్స్ చరిత్ర పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ, కామర్స్ అకౌంటెన్సీలో 20 మార్కుల చొప్పున ఇంటర్నల్ మార్కులు ఇస్తారు.
స్కాన్ చేస్తే వీడియో,ఆడియో పాఠ్యాంశాలు..
పాఠాలపై విద్యార్థుల్లో ఆసక్తిని పెంచే దిశగా పాఠ్యాం శాల్లో క్యూఆర్ కోడ్ ప్రవేశపెట్టారు. దానిని స్కాన్ చేస్తే సంబంధిత పాఠ్యాంశాలకు సంబంధించి వీడియో, ఆడియో పాఠాలు ఓపెన్ కానున్నాయి. తమకు వీలైన ప్పుడల్లా విద్యార్థులు నేర్చుకోలిగేలా పాఠాలను రూపొం దించారు. పాఠ్యాంశాల పక్కన డూయూనో (మీకు తెలుసా) అనే అంశాలపై శాస్త్రవేత్తలకు సంబంధించిన విభిన్నమైన అంశాలతో బాక్సులతో ఏర్పాటు చేశారు.
అల్పాహారం, మధ్యాహ్న భోజనం..
వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు ఉదయం అల్పాహారంగా రాగి జావ, పాలతోపాటు మధ్యాహ్న భోజనాన్ని అందించ నుంది. దీనివల్ల కళాశాలలకు విద్యార్థుల సంఖ్య పెరు గుతుందని, డ్రాపౌట్లు తగ్గుతాయని భావిస్తోంది. విద్యా ర్ధులకు ఏకరూప దుస్తులు, బూట్లు, బెల్టులు, టైలు సైతం ఇవ్వాలని యోచిస్తోంది. ఆయా కళాశాలల నుం చి విద్యార్థుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఇప్పటివరకు యేటా విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకా లను ప్రభుత్వం అందజేస్తోంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి నోటుబుక్కులను పంపిణీ చేసేందుకు అదికా రులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. వీటిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. జిల్లావ్యాప్తంగా 16 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా, ఆయా కళాశాలల్లో సుమారు 4 వేల మందికి పైగా విద్యనభ్యసిస్తున్నారు.
కొత్తగా ఈ ఏడాది నుంచి ఏసీఈ కోర్సు
ఇప్పటి వరకు ఎంపీసీ, బైపీసీ, హెచ్‌ఈసీ, సీఈసీ, ఎంఈసీ వంటి కోర్సులు ఉన్నాయి. ఈ ఏడాది నుంచి ఇంటర్ బోర్డు కొత్త కోర్సు ప్రవేశపెడుతోంది. ఇక నుంచి ఏసీఈ గ్రూపును తీసుకొచ్చింది. ఇంటర్ స్థాయిలోనే మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో అకౌంట్స్, కామర్స్, ఎకనామిక్స్ (ఏసీఈ) సబ్జెక్టులతో కోర్సును అందుబాటులోకి తెచ్చింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచే ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, కస్తూర్బా పాఠశాలలు, ఆదర్శ పాఠశాలలు, గురుకుల విద్యాలయాల్లో కోర్సును అమలు చేయనున్నారు. ఇం టర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు కొత్త సిలబస్‌తో కూడిన పాఠ్యపుస్తకాలను జూన్ 1వ తేదీనాటికి పంపిణీ చేస్తామని ఇటీవల ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. దీంతో ఈ ఏడాది నుంచి కొత్త గ్రూపు ప్రవేశ పెట్టడంతో విద్యార్థులకు ఏ మేరకు ఉపయోగపడుతుందో వేచి చూడాలి.