Share News

మధ్యవర్తిత్వంతో వివాదాల సత్వర పరిష్కారం

ABN , Publish Date - Sep 25 , 2026 | 12:01 AM

మధ్యవర్తిత్వంతో వివా దాలు సత్వరం పరిష్కారం అవుతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. జిల్లా కోర్టులో గురువారం మధ్యవర్తిత్వం 3.0పై సమీక్ష సమావేశం నిర్వహించారు.

మధ్యవర్తిత్వంతో వివాదాల సత్వర పరిష్కారం

పెద్దపల్లి టౌన్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): మధ్యవర్తిత్వంతో వివా దాలు సత్వరం పరిష్కారం అవుతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. జిల్లా కోర్టులో గురువారం మధ్యవర్తిత్వం 3.0పై సమీక్ష సమావేశం నిర్వహించారు. సీనియర్‌ సివిల్‌ జడ్జి వంగర భవాని, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీనిజ కోహిర్కర్‌ పాల్గొ న్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. న్యాయస్థానాల్లో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కోర్టులపై భారం అధిక మవుతోందన్నారు. దీంతో ప్రజలు న్యాయం పొందేందుకు ఎక్కువ కాలం వేచి ఉండాల్సి వస్తోందని తెలిపారు. వివాదాలను సులభంగా, త్వరి తగతిన పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థలో శిక్షణ పొందిన 20 మంది మధ్యవర్తిత్వ న్యాయవాదులు అందుబాటులో ఉన్నారని తెలిపారు. భార్యాభర్తల మధ్య వివాదాలు, భూ తగాదాలు, మోటార్‌ వాహన చట్టం కింద పెండింగ్‌లో ఉన్న వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరిం చుకోవచ్చని వివరించారు. ఈ ప్రక్రియకు ఎలాంటి ఖర్చు ఉండదని, మధ్యవర్తిత్వం ద్వారా కేసును రాజీ చేసుకున్నట్లయితే కోర్టు ఫీజును తిరిగి చెల్లిస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Updated Date - Sep 25 , 2026 | 12:01 AM