Share News

పుష్కరాల పనులు వేగవంతం చేయాలి

ABN , Publish Date - Sep 28 , 2026 | 11:55 PM

గోదావరినది పుష్కరాల సం దర్భంగా చేపట్టనున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్ణీత సమ యంలోగా పూర్తి చేసేలా అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశించారు. సోమవారం మంథనిలో కలెక్టర్‌ పర్యటించి గోదావరి పుష్కర ఘాట్లు, గౌతమేశ్వర ఆలయ పునర్నిర్మాణ పనులు, పుష్కరాల కోసం చేపట్టాల్సిన భూసేకరణ తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

పుష్కరాల పనులు వేగవంతం చేయాలి

మంథని, సెప్టెంబర్‌ 28 (ఆంధ్రజ్యోతి): గోదావరినది పుష్కరాల సం దర్భంగా చేపట్టనున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్ణీత సమ యంలోగా పూర్తి చేసేలా అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశించారు. సోమవారం మంథనిలో కలెక్టర్‌ పర్యటించి గోదావరి పుష్కర ఘాట్లు, గౌతమేశ్వర ఆలయ పునర్నిర్మాణ పనులు, పుష్కరాల కోసం చేపట్టాల్సిన భూసేకరణ తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో సం బంధిత అధికారులు, రైతులతో పుష్కరాల అవసరాలకు సంబంధించిన ఎండోమెంట్‌, ఇరిగేషన్‌ భూసేకరణ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని మంథనిలో అవసరమైన అభివృద్ధి పనులను ముందస్తుగా పూర్తి చేయా లని సూచించారు. పుష్కరాల కోసం అవసరమైన భూమిని త్వరితగతిన సేకరించి, పెండింగ్‌లో ఉన్న భూసేకరణ అంశాలను నిబంధనల ప్రకారం పరిష్కరించాలని ఆదేశించారు. రైతులకు నిబంధనల ప్రకారం పరిహారం అందేలా చర్యలు తీసుకుంటూనే, పుష్కరాల పనులకు అవసరమైన భూమిని సకాలంలో అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఘాట్ల వద్ద భక్తులకు అవసరమైన మౌలిక వసతులు, తాగునీరు, విద్యుత్‌, పారిశుధ్యం, రహదారులు, పార్కింగ్‌ సౌకర్యాలను ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. భక్తుల రాకపోకలకు అనుగుణంగా రహదా రుల అనుసంధానం, వాహనాల పార్కింగ్‌, భద్రత అంశాలను పరిశీలిం చి అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలన్నారు. మంథనిలోని గౌతమేశ్వర ఆలయ పునర్నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు. పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలన్నారు.

Updated Date - Sep 28 , 2026 | 11:55 PM