Share News

లక్ష్యం దాటిన కొనుగోళ్లు

ABN , Publish Date - Jun 07 , 2026 | 12:26 AM

జిల్లాలో ఇప్పటికే పౌరసరఫరాల శాఖ యాసంగిలో ధాన్యం కొనుగోలు అంచనా దాటి సేకరిం చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో యాసంగి ధాన్యం దిగుబడి 4 లక్షల 56 వేల 664 మెట్రిక్‌ టన్నులు వస్తుందని అంచనా వేశారు. ఇందులో పౌరసరఫరాల శాఖ 3 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు 3 లక్షల 3,940 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. మరో వారం రోజుల పాటు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం కొనసాగనుంది.

 లక్ష్యం దాటిన కొనుగోళ్లు

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

వర్షాలు వచ్చేస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు అండమాన్‌ దీవుల నుంచి కేరళకు చేరుకున్నాయి. మరో మూడు, నాలుగు రోజుల్లో ఉమ్మడి రాష్ట్రంలోకి రుతు పవనాలు రానున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అక్కడక్కడ చిరుజల్లులు సైతం కురిసాయి. దీంతో జిల్లాలో కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం రాశులు పోసుకొని తూకాల కోసం నిరీక్షిస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఇప్పటికే పౌరసరఫరాల శాఖ యాసంగిలో ధాన్యం కొనుగోలు అంచనా దాటి సేకరిం చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో యాసంగి ధాన్యం దిగుబడి 4 లక్షల 56 వేల 664 మెట్రిక్‌ టన్నులు వస్తుందని అంచనా వేశారు. ఇందులో పౌరసరఫరాల శాఖ 3 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు 3 లక్షల 3,940 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. మరో వారం రోజుల పాటు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం కొనసాగనుంది. కేంద్రాల వద్ద మరో 30 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉన్నట్లు తెలుస్తోంది. రైతుల్లో మాత్రం వర్షాల గుబులు మొదలైంది. జిల్లాలో కొనుగోలు కేంద్రాలకు పౌరసరఫరాల శాఖ అంచనాకు మించి ధాన్యం రైతులు తీసుకొచ్చారు. ఈ సారి మిల్లర్లు రైతుల వద్ద నేరుగా కొనుగోలు చేయకపోవడంతోనే కొనుగోలు కేంద్రాల వద్దకు ధాన్యం విక్రయించు కోవడానికి తీసుకువచ్చారని అధికారులు చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా యాసంగిలో మాత్రం జిల్లా రైతులు తాము పండించిన పంటను అమ్ముకో వడానికి నానా తంటాలు పడే పరిస్థితులు ఎదుర్కొం టున్నారు. జిల్లా కలెక్టర్‌ గరిమా అగ్రవాల్‌తో పాటు అధికార యంత్రాంగం పూర్తిగా ధాన్యం సేకరణ ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నారు. కలెక్టర్‌ టెలి కాన్ఫరెన్స్‌ ద్వారా సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. ధాన్యం తూకం వేయించడం, ధాన్యాన్ని తరలించడం కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు.

159 కేంద్రాల్లో కొనసాగుతున్న తూకం

జిల్లాలో కొనుగోలు కేంద్రాల వద్దకు పౌరసరఫరాల శాఖ లక్ష్యం కంటే మించి ధాన్యం వచ్చింది. ఇంకా దాదాపు 30 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కేంద్రాల వద్ద ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. జిల్లా ధాన్యం కొనుగోలు లారీల కొరత, హమాలీల కొరత ఎదురవుతుండడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో పౌర సరఫరాల లక్ష్యం ప్రకారం 3 లక్షల మెట్రిక్‌ టన్నులు సేకరించాల్సి ఉంది. ఇప్పటివరకు 3,03,940 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించారు. జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్ల కోసం 236 కేంద్రాలు ప్రారంభించారు. ఇందులో ఐకేపీ ద్వారా 132 కేంద్రాలు, వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా 96 కేంద్రాలు, మెప్మా ద్వారా 7 కేంద్రాలు, డీసీఎంఎస్‌ ద్వారా ఒక కేంద్రాన్ని ప్రారంభించారు. ఇందులో 77 కేంద్రాల్లో కొను గోళ్లు పూర్తి చేశారు. 159 కేంద్రాల్లో కొనుగోళ్లు కొనసా గుతున్నాయి. జిల్లాలో యాసంగిలో 1.83 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇందులో 1,79,650 దొడ్డు రకం, 7,539 ఎకరాల్లో సన్న రకం వరి సాగు చేశారు. దీని ద్వారా 4 లక్షల 56 వేల 664 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందులో దొడ్డు రకం 4 లక్షల 49 వేల 125 మెట్రిక్‌ టన్నులు, సన్న రకం 7,539 మెట్రిక్‌ టన్నులు వస్తుందని. ఇందులో పౌరసరఫరాల శాఖ 3 లక్షల మెట్రిక్‌ టన్నులు కొను గోలు చేసే విధంగా లక్ష్యంగా పెట్టుకుంది ఇందులో 2.97 లక్షల మెట్రిక్‌ టన్నుల దొడ్డు రకం ధాన్యం, 7,539 మెట్రిక్‌ టన్నులు సన్న రకం ధాన్యం కొనుగోలు లక్ష్యం గా ఉంది. పౌరసరఫరాల శాఖ ఇప్పటివరకు 3,03,940 మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేసింది. 3,00,437 దొడ్డు రకం ధాన్యం, 3,502 మెట్రిక్‌ టన్నులు సన్న రకం ధాన్యం కొనుగోలు చేశారు. ధాన్యం కొను గోలులో ఐకేపీ ద్వారా 1,62,725 మెట్రిక్‌ టన్నులు, వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా 1,30,359 మెట్రిక్‌ టన్నులు, మెప్మా ద్వారా 7,937 మెట్రిక్‌ టన్నులు, డీసీఎంఎస్‌ ద్వారా 2,917 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశారు. అందులో మిల్లులకు 2,95,796 మెట్రిక్‌ టన్ను లు పంపించింది.

రైతుల ఖాతాల్లో రూ. 557.20 కోట్లు జమ

యాసంగిలో ఇప్పటి వరకు రూ 726.04కోట్ల విలువైన ధాన్యాన్ని 37,681 మంది రైతుల నుంచి కొను గోలు చేశారు. ఇందులో ఇప్పటి వరకు 33,279 మంది రైతులకు రూ. 557.20 కోట్లు చెల్లించారు. ఐకేపీ ద్వారా కొనుగోలు చేసిన 18,280 మంది రైతులకు రూ, 295.57 కోట్లు చెల్లించగా సింగిల్‌ విండోల ద్వారా 13,967 మంది రైతులకు రూ. 243.98 కోట్లు, డీసీఎంఎస్‌ ద్వారా 194 మంది రైతులకు రూ 3.61 కోట్లు, మెప్మా ద్వారా ధాన్యం కొనుగోలు చేసిన 838 మంది రైతులకు రూ 14.05కోట్లు ధాన్యం డబ్బులు చెల్లించారు.

Updated Date - Jun 07 , 2026 | 12:26 AM