ప్రభుత్వ పాఠశాల ఫలితాలపై ప్రచారం చేయాలి
ABN , Publish Date - May 17 , 2026 | 11:41 PM
ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చిన మంచి ఫలి తాలు ప్రతీ ఒక్కరికి తెలిసేలా విస్తృత ప్రచా రం చేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింత కుంట విజయరమణరావు అన్నారు. ఆదివారం విద్యా వారోత్సవాల్లో భాగంగా కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా, మండల, గ్రామీణ టాపర్ పదో తరగతి విద్యార్థుల సన్మాన కార్యక్ర మంలో కలెక్టర్ కోయశ్రీహర్ష, ప్రభుత్వ విప్ పాల్గొన్నారు.
పెద్దపల్లి కల్చరల్, మే 17(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చిన మంచి ఫలి తాలు ప్రతీ ఒక్కరికి తెలిసేలా విస్తృత ప్రచా రం చేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింత కుంట విజయరమణరావు అన్నారు. ఆదివారం విద్యా వారోత్సవాల్లో భాగంగా కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా, మండల, గ్రామీణ టాపర్ పదో తరగతి విద్యార్థుల సన్మాన కార్యక్ర మంలో కలెక్టర్ కోయశ్రీహర్ష, ప్రభుత్వ విప్ పాల్గొన్నారు. మెరిట్ విద్యార్థులకు ప్రశంసాప త్రాలను అందించి సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకున్న 98 మందికిపైగా విద్యార్థులు 550కు పైగా మార్కులు సాధిం చడం అభినందనీయమన్నారు. ఈ ఫలితాల సాధనలో కృషి చేసిన ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
రెం డేళ్లుగా విద్యారంగంపై ప్రత్యేక దృష్టి పెట్టా మని, కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశా లల్లో రిన్నోవేషన్ పనులు, టాయిలెట్లు, అద నపు తరగతి గదులు, తాగునీటి సదుపా యాలు, తదితర అభివృద్ధి పనులకు ప్రత్యేక నిధులు మంజూరు చేసి పూర్తి చేశామని తెలి పారు. ప్రస్తుతం ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు పని చేస్తున్నా యని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఫలితాలను అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రచారం చేయాలని, మెరిట్ విద్యార్థుల ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలన్నారు. విద్యా ర్థులు చెడు అలవాట్లకు గురికాకుండా తల్లితండ్రులు చొరవ తీసుకోవాలని సూచించారు. గత ఏడాదితో పోల్చితే ప్రస్తుత ఏడాది పదో తరగతి, ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారన్నారు. అనంతరం పది, ఇంటర్‌లో అధిక మార్కులు సాధించిన 11 మంది విద్యార్థులను సన్మా నించి, రూ.10 వేల చొప్పున చెక్కులను పంపిణీ చేశారు. జిల్లా విద్యాధికారి శారద, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కల్పన, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.