ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యం
ABN , Publish Date - Nov 14 , 2026 | 11:50 PM
ప్రజా సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యమిస్తున్నామని ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ అన్నారు. పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం ప్రారంభించారు.
పాలకుర్తి, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): ప్రజా సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యమిస్తున్నామని ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ అన్నారు. పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం ప్రారంభించారు. అనంతరం జీడీనగర్ గ్రామపంచాయతీ పరిధి లోని ఓ ప్రయివేటు ఫంక్షన్‌హాల్‌లో 354 మందికి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదా రులకు, 562 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు, 50 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మె ల్యే మాట్లాడుతూ మహిళా సంఘాలకు రుణాలు అందిస్తూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పాలకుర్తి మండల మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సుతోపాటు రూ. 2 కోట్లతో ఫంక్షన్‌హాల్ మంజూరు చేసినట్లు వెల్లడించారు. జయ్యారంలో 25 ఎకరాల్లో విత్తన పరిశోధన కేంద్రం మం జూరైందని, ఆందుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని తహసీల్దార్‌ను ఆదేశించినట్లు చెప్పారు. కుక్కలగూడూర్ బండలవాగు ప్రాజెక్టుకు ఎల్లంపల్లి నుంచి లిప్ట్ ద్వారా నీటిని తరలించే ప్రణాళిక పూర్తయిందన్నారు. ఎంపీడీవో రమేష్, తహసీల్దార్ కోటేశ్వ రరావు, అధికారులు, సిబ్బంది, రామగుండం మార్కెట్ కమిటీ చైర్మెన్ గడ్డం తిరుపతి, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు పర్షవేణి శ్రీనివాస్ యాదవ్, డీసీసీ ప్రధానకార్యదర్శి సూర సమ్మయ్య, పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, జీడినగర్ సర్పంచ్ సూర రమ పాల్గొన్నారు.