Share News

ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు

ABN , Publish Date - Oct 06 , 2026 | 12:14 AM

రాములపల్లి వద్ద రూ.200 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్‌ పాఠశాల నిర్మాణ పనులను ప్రభుత్వ విప్‌, పెద్దప ల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు సోమవారం పరిశీలించారు.

ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు

ఎలిగేడు, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): రాములపల్లి వద్ద రూ.200 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్‌ పాఠశాల నిర్మాణ పనులను ప్రభుత్వ విప్‌, పెద్దప ల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు సోమవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ కుల మత బేధాలు లేకుండా ఒకే వేదికపై విద్యా భ్యాసం చేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నియోజకవర్గానికి ఇంటి గ్రేటెడ్‌ పాఠశాలను మంజూరు చేశారన్నారు. రెండున్నర సంవత్సరాలలో నియోజకవర్గంలో పాఠశాలల అభివృద్ధికి 70 కోట్లు నిధులు మంజూరు మౌలిక వసతులు కల్పించామన్నారు. ఇంటర్నేషనల్‌ స్కూళ్లకు దీటుగా ఇంటిగ్రేటెడ్‌ పాఠశాల నిర్మాణం జరుగుతుందని, 2560 మంది పిల్లలకు విద్య అందించడంతోపాటు హాస్టల్‌, ప్లే గ్రౌండ్‌, డైనింగ్‌ హాల్‌ నిర్మాణం జరుగుతుందన్నారు. మధ్యాహ్న భోజనంతోపాటు అల్పాహా రం, జూనియర్‌ కళాశాల విద్యార్థులకు మధ్యా హ్న భోజనం కూడా ప్రారంభించామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నారని, పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. వ్యవ సాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పొట్యాల రమేష్‌, వైస్‌ చైర్మన్‌ కోరుకంటి వెంకటేశ్వర్‌ రావు, పిఎసిఎస్‌ చైర్మన్‌ సామ రాజేశ్వర్‌ రెడ్డి, తహసీల్దార్‌ యాకన్నా, సర్పంచ్‌లు సిద్ది తిరుపతి, మద్దెల రమదేవి, కప్పల ప్రవీణ్‌, ఏలేటి వెంకట్‌ రెడ్డి, మారం కొంరయ్య, పల్లెర్ల వెంకటేష్‌ గౌడ్‌, గోపు రజిత, రామిడి శైలజ, రాధ గంగ జమున, రంగు లత, దుగ్యాల వాణి కాంగ్రెస్‌ శ్రేణులు పాల్గొన్నారు.

ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం

సుల్తానాబాద్‌, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్‌ విజయ రమణారావు అన్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో సోమవారం ఇం టర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు అల్పాహారంతోపాటు మధ్యాహ్న భోజనం అందిస్తున్నామ న్నారు. విద్యార్థుల అరోగ్యం భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. రూ.70 కోట్లతో పెద్దపల్లి నియోజకవర్గంలో పాఠశా లల అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. రూ.200 కోట్లతో ఇంటిగ్రేటడ్‌ పాఠశాలల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ హాస్టళ్ళను ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేసి అందరికీ సమాన విద్య అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంతటి అన్నయ్య గౌడ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ రాధాక్రిష్ణ, వైస్‌ చైర్మన్‌ పుష్పలత, కౌన్సిలర్లు, పాల్గొన్నారు.

Updated Date - Oct 06 , 2026 | 12:14 AM