విద్యుత్ సమస్యల పరిష్కారానికే ప్రజాబాట
ABN , Publish Date - Jan 10 , 2026 | 11:45 PM
చామనపల్లి సర్పంచ్ వేల్పుల రేవతి ఆధ్యర్యంలో విద్యుత్ అధికారులు శనివారం ప్రజాబాట నిర్వహించారు. అధికారులు డీసీహెచ్ రాజాబ్రహ్మచారి, ఏడీ ఠాగూర్ విజయగోపాల్‌సింగ్ సమస్యలు తెలుసుకున్నారు.
ధర్మారం, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): చామనపల్లి సర్పంచ్ వేల్పుల రేవతి ఆధ్యర్యంలో విద్యుత్ అధికారులు శనివారం ప్రజాబాట నిర్వహించారు. అధికారులు డీసీహెచ్ రాజాబ్రహ్మచారి, ఏడీ ఠాగూర్ విజయగోపాల్‌సింగ్ సమస్యలు తెలుసుకున్నారు. లూజ్ వైర్లు సరి చేయడంతోపాటు అవసరమైన చోట కొత్తపోల్స్ వేస్తామని తెలిపారు. విద్యుత్ సమస్యలు లేకుండా కృషి చేస్తామని ఏఈ మైపాల్‌రెడ్డి పేర్కొన్నారు. ఉప సర్పంచ్ తీగుల్ల కవిత, మాజీ ఎంపీటీసీ నాగరుజు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
రామగిరి,(ఆంధ్రజ్యోతి): పన్నూర్‌లో సర్పంచ్ చిందం మహేష్ ఆధ్వర్యంలో విద్యుత్ అధికారులు ప్రజాబాట కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను నమోదు చేసుకొని సమస్యపై చర్యలు తీసుకుంటామ న్నారు. ఏడిఈ వెంకటరమణ, ఏఈ మహేందర్‌రెడ్డి, ఎస్‌ఎల్‌ఐ భూమయ్య, ఎల్‌ఐ, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. --