Share News

ప్రజాపాలన గ్రామసభలు ప్రగతికి దిక్సూచి

ABN , Publish Date - Apr 03 , 2026 | 12:05 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన సభలు గ్రామాల ప్రగతికి దిక్సూచి లాంటివని ప్రభుత్వ విప్‌ చింతకుంట విజయరమణారావు అన్నారు. మండలంలోని రూపునారాయణపేటలో బుధవారం నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ప్రజాపాలన గ్రామసభలు ప్రగతికి దిక్సూచి

ఓదెల, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన సభలు గ్రామాల ప్రగతికి దిక్సూచి లాంటివని ప్రభుత్వ విప్‌ చింతకుంట విజయరమణారావు అన్నారు. మండలంలోని రూపునారాయణపేటలో బుధవారం నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్నరకం ధాన్యానికి బోనస్‌, చేయూత పెన్షన్లు, రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్‌, కల్యాణలక్ష్మి, కొత్తరేషన్‌ కార్డులు అందిస్తున్నామన్నారు. అలాగే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా, ఇంటర్మీడియట్‌ వరకు విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం కల్పించడం జరుగుతుందన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పధకాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. అలాగే ఓదెల, కనగర్తి, కొలనూర్‌, పొత్కపల్లి గుంపుల తోపాటు మండలంలోని గ్రామాలలో గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ప్రజాపాలన గ్రామసభలను నిర్వహించి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్‌ సాగర్‌ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి రంగారెడ్డి, ఎంపీడీవో అనిల్‌ రెడ్డి, తహసీల్దార్‌ ధీరజ్‌ కుమార్‌, సర్పంచులు కనికిరెడ్డి సతీష్‌, అంబాల సారమ్మ కొమురయ్య, పల్లె కనుకయ్య, బొంగోనిరమ, శ్రీనివాస్‌, చొప్పరి సంధ్యారాణి,ఆవాల ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2026 | 12:05 AM