పీఎస్‌వోలు క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి
ABN , Publish Date - Aug 19 , 2026 | 12:00 AM
వీఐపీ భద్రత విధుల్లో ఉన్న పీఎస్‌వో(పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్) లు అప్రమత్తత, క్రమశిక్షణ, వృత్తి నైపుణ్యంతో, పరస్పర సహకారంతో విధులు నిర్వహించాలని రామగుండం సీపీ అంబర్‌కిశోర్ ఝా పేర్కొన్నారు.
కోల్‌సిటీ, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): వీఐపీ భద్రత విధుల్లో ఉన్న పీఎస్‌వో(పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్) లు అప్రమత్తత, క్రమశిక్షణ, వృత్తి నైపుణ్యంతో, పరస్పర సహకారంతో విధులు నిర్వహించాలని రామగుండం సీపీ అంబర్‌కిశోర్ ఝా పేర్కొన్నారు. మంగళవారం కమిషనరేట్‌లో వీఐపీ భద్రత విధుల్లో పాటించాల్సిన ప్రమాణాలు, సమాచార మార్పిడి, సమన్వయం, అత్య వసర పరిస్థితుల్లో స్పందించాల్సిన అంశాలపై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఎంత బిజీగా ఉన్నప్పటికీ రోజు వ్యాయామం చేస్తూ శారీరక దారుఢ్యాన్ని కాపాడుకోవాలన్నారు. క్రమశిక్షణ, నిజాయితీ, విశ్వసనీయతతో విధులు నిర్వహించాల న్నారు. ప్రజలతో నేరుగా సంబంధం కలిగిన పీఎస్ ఓలు అవినీతి, అక్రమ ప్రయోజనాలకు దూరంగా ఉం డాలన్నారు. వీఐపీ భద్ర తల్లో అనూహ్య పరిస్థితులు ఎప్పుడు ఎదురవుతాయో ఊహించలేమని, అందువల్ల పీఎస్‌ఓలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలన్నారు. పరిసరాలను నిశితంగా పరిశీలించడం, పరిస్థితిని అం చనా వేయడం, తక్షణ నిర్ణయాలు తీసుకోవడం వంటి సామర్థ్యాలు ముఖ్యమన్నారు. వీఐపీ భద్రత సమాచా రాన్ని గోప్యంగా ఉంచాలని, సామాజిక మాద్యమాల్లో అనధికారికంగా పంచుకోరాదన్నారు. ఏఆర్ ఏసీపీలు రమేష్, ప్రతాప్, ఆర్‌ఐలు శేఖర్, దామోదర్ పాల్గొన్నారు.
శాంతిభద్రతల అమలులో రాజీపడవద్దు
శాంతి భద్రతల పరిరక్షణ, చట్టాల అమలులో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడవద్దని సీపీ అంబర్ కిశోర్ ఝా పేర్కొన్నారు. గోదావరిఖని ఏసీపీ కార్యాలయాన్ని సీపీ తనిఖీ చేశారు. కమిషనర్‌కు డీసీపీ రాంరెడ్డి, ఏసీపీ ఆహ్వానించారు. సాయుధ పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం రికార్డులను సీపీ పరిశీలించారు. డివిజన్ పరిధిలో పురోగతిలో ఉన్న కేసులు, నిందితుల అరెస్టులు, అట్రాసిటీ కేసు కింద నమోదు అయిన కేసుల స్థితిగతులు, పెండింగ్ కేసులపై సమీక్ష జరిపారు. కేసుల దర్యాప్తులో జాప్యా నికి గల కారణాల గురించి ప్రశ్నించారు. రౌడీషీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని, వారి కద లికలను గమనించాలన్నారు. శాంతి భద్రతలకు విఘా తం కలిగించే వారు, చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సివిల్, భూ వివాదాల్లో పోలీసులు అనవసర జోక్యం చేసుకోవద్దని, నిబంధనలకు అనుగుణంగా మాత్రమే వ్యవహరించాలన్నారు. మెరుగైన పోలీసింగ్ అందిం చడంతో పాటు ప్రతీ కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలన్నారు. ఏసీపీ రమేష్‌తో పాటు సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.