Share News

పారదర్శక పాలన అందించాలి

ABN , Publish Date - Mar 08 , 2026 | 11:28 PM

మున్సిపల్‌ పాలకవర్గం ప్రజ లకు అందుబాటులో ఉండాలని, పారదర్శకంగా పాలన అందించాలని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. గత నెల 17న మున్సిపాలిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌గా ఎన్నికైన బిరుదు రాధాక్రిష్ణ ఆదివారం ఎమ్మెల్యే సమక్ష్యంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు.

పారదర్శక పాలన అందించాలి

సుల్తానాబాద్‌, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ పాలకవర్గం ప్రజ లకు అందుబాటులో ఉండాలని, పారదర్శకంగా పాలన అందించాలని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. గత నెల 17న మున్సిపాలిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌గా ఎన్నికైన బిరుదు రాధాక్రిష్ణ ఆదివారం ఎమ్మెల్యే సమక్ష్యంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ముందుగా మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ఉన్న మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు విగ్రహానికి ఎమ్మెల్యేతో పాటు చైర్మన్‌ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రత్యేక పూజల అనంతరం చైర్మన్‌గా బిరుదు రాధాక్రిష్ణ రిజిష్టర్‌లో సంతకం చేశారు. రాధాక్రిష్ణ సమత దంపతులను ఎమ్మెల్యేతోపాటు పెద్దపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ నూగిల్ల మల్లయ్య సన్మానిం చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకుల హయాంలో సుల్తానాబాద్‌ అభివృద్ధి కాలేదని, పట్టణంపై సవతి తల్లి ప్రేమ చూపి మాటలకు పరిమితం చేసి ప్రజలను మభ్య పెట్టారన్నారు. ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇచ్చి 13 మంది అభ్యర్థులను గెలిపించారని, చైర్మన్‌తో పాటు కౌన్సిలర్లందరు ప్రజలకు సేవలు అందించా లన్నారు. వార్డుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమ స్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. మున్సి పల్‌ చైర్మన్‌ బిరుదు రాధాక్రిష్ణ మాట్లాడుతు ఎమ్మెల్యే ప్రోత్సాహంతో పట్టణంలో ప్రజలు ఎదు ర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా నని, ఎమ్మెల్యే సూచనల మేరకు అభివృద్ధి పనులు చేపడతామన్నారు. వైస్‌ చైర్‌పర్సన్‌ అంతటి పుష్పలత, కమిషనర్‌ టి రమేష్‌, కౌన్సిలర్లు ఈర్ల సమత, గాజుల రాజమల్లు, కందునూరి సమత, శోభ, బాకం సాయికుమార్‌, ఊట్ల వరప్రదీప్‌, చింతల రాజు, టికే ప్రభాకర్‌, శంకరమ్మ, అమిరిశెట్టి శ్రావణి, సిద్ద తిరుపతి, వేగోళం పద్మ, మంజుల, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మినుపాల ప్రకాశ్‌ రావు, రిటైర్డు అదనపు ఎస్పీ సాయిబాబ తదితరులు పాల్గొన్నారు. బాధ్యతలు చేపట్టిన మున్సిపల్‌ చైర్మన్‌ రాధాక్రిష్ణను పలువురు సన్మానించారు. మాజీ ఎంపీపీ ఐల రమేష్‌, సమిండ్ల శ్రీనివాస్‌రావు, సి సత్యనారాయణరెడ్డి, వేముల రాంమూర్తి, శ్రీగిరి శ్రీనివాస్‌ తదితరులతో పాటు పట్టణ ప్రముఖులు వ్యాపారులు శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Mar 08 , 2026 | 11:28 PM