Share News

ఆదర్శవంతమైన పాలన అందించాలి

ABN , Publish Date - Jan 20 , 2026 | 12:24 AM

సర్పంచ్‌లు ఆదర్శవంతమైన పరిపాలన అందించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం పెద్దబొం కూర్‌లోని మదర్‌థెరిసా ఇంజనీరింగ్‌ కళాశాలలో నూతన సర్పంచ్‌లకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్ర మంలో కలెక్టర్‌ పాల్గొన్నారు.

ఆదర్శవంతమైన పాలన అందించాలి

పెద్దపల్లి రూరల్‌, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): సర్పంచ్‌లు ఆదర్శవంతమైన పరిపాలన అందించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం పెద్దబొం కూర్‌లోని మదర్‌థెరిసా ఇంజనీరింగ్‌ కళాశాలలో నూతన సర్పంచ్‌లకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్ర మంలో కలెక్టర్‌ పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలలో గెలుపొందిన సర్పంచ్‌ లకు, వార్డు సభ్యులకు అభినందనలు తెలిపారు. గ్రామ అభివృద్ధి, పరిపాలన అంశంలో రాజకీయాలను దూరంగా ఉంచుతూ రాబోయే 5 సంవత్సరాలపాటు పని చేయాలని కలెక్టర్‌ సూచించారు. పంచాయతీ పాలనలో వచ్చిన మార్పులను సర్పంచ్‌లు అర్థం చేసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సంఘం నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకు చేరుతాయని, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అందించే నిధులు, పన్నుల వసూలు, ఇతర ఆదాయ మార్గాలు, బడ్జెట్‌ రూపకల్పన, పంచాయతీలో పాలన వ్యవహా రాలు, పారిశుధ్య నిర్వహణ, గ్రీన్‌ బడ్జెట్‌ తదితర అంశాలకు సంబంధించి 5 రోజులపాటు శిక్షణ ఇస్తామన్నారు. గ్రామీణ ఉపాధిహామీ పథకంలో వచ్చిన మార్పులను సర్పంచ్‌లు గమనించాలని, వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను వినియోగిం చుకుంటూ పంచాయతీ అభివృద్ధికి నిధులు ఎలా సమకూర్చుకోవాలి, గ్రామ అభివృద్ధి ప్రణాళికల రూప కల్పన, గ్రామంలో నూతన నిర్మాణాలకు, లేఔట్‌లకు అనుమతుల మంజూరుకు పాటించాల్సిన నియమ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్‌ తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం వివిధ కేటగిరీలలో మంచి ప్రతిభ కనబరిచే గ్రామాలకు ప్రోత్సాహకాలు అందిస్తుందని, సదరు నిధులు వచ్చే విధంగా కృషి చేయాలని కలెక్టర్‌ సూచించారు. గ్రామాలలో చేపట్టే అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలు తప్పని సరిగా ఎంబీ రికార్డులలో నమోదయ్యేలా చూడాలని కలెక్టర్‌ తెలిపారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి పరిపాలనకు సంబంధించిన వ్యవహారాలు, బిల్లుల నమోదు, చెల్లింపుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌ లైన్‌ నమోదుపై అవగాహన పెంచుకొని గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని అన్నారు. జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, జడ్పీ సీఈవో నరేందర్‌, ఎంపీడీవో కొప్పుల శ్రీనివాస్‌, ఎంపీవోలు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 20 , 2026 | 12:24 AM