Share News

ప్రజలకు సమర్ధవంతమైన సేవలందించాలి

ABN , Publish Date - Apr 07 , 2026 | 11:50 PM

మండల ప్రజలకు సమర్ధవంతమైనా సేవలను అందేలా ప్రభత్వ అదికారులు పనిచేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో మంగళవారం కలెక్టర్‌ పర్యటించారు. తహసీల్దార్‌ కార్యాలయంలో రికార్డులను పరిశీలించి, భూ సమస్యలపై ప్రజలు అందించిన పెండింగ్‌ దరఖస్తులను వెంటనే పరిష్కరించాలని తహసీల్దార్‌ గిరిని ఆదేశించారు.

ప్రజలకు సమర్ధవంతమైన సేవలందించాలి

జూలపల్లి, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): మండల ప్రజలకు సమర్ధవంతమైనా సేవలను అందేలా ప్రభత్వ అదికారులు పనిచేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో మంగళవారం కలెక్టర్‌ పర్యటించారు. తహసీల్దార్‌ కార్యాలయంలో రికార్డులను పరిశీలించి, భూ సమస్యలపై ప్రజలు అందించిన పెండింగ్‌ దరఖస్తులను వెంటనే పరిష్కరించాలని తహసీల్దార్‌ గిరిని ఆదేశించారు. భూభారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను స్లాట్‌ల వారిగా పూర్తిచేయాలని ఆదేశించారు. అనంతరం పీహెచ్‌సీ తనిఖీ చేసి ప్రజలకు అందిస్తున్న వైద్యసేవలు, పరిసరాలను, రికార్డులను పరిశీలించారు. సమయపాలన పాటించి ప్రజలకు మెరుగైన వైద్యసేవలను అందించాలన్నారు. తెలుకుంటలో కస్తూర్బాగాంధీ విద్యాలయం, పెద్దాపూర్‌ మోడల్‌స్కూల్‌లలో విద్యార్థులకు అందిస్తున్న విద్య, భోజనం మెనూ, వసతి, పరిసరాలను కలెక్టర్‌ పరిశీలించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా చూడాలని సూచించారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ప్రాథమిక వైద్యులు సంపత్‌రెడ్డి, ఎంఈవో సరస్వతి పలువురు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 07 , 2026 | 11:50 PM