Share News

ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి

ABN , Publish Date - Aug 23 , 2026 | 12:08 AM

గ్రామాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో పంచాయతీ అధి కారులతో గ్రామీణ పరిపాలనపై సమీక్ష నిర్వహిం చారు.

ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి

పెద్దపల్లి, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో పంచాయతీ అధి కారులతో గ్రామీణ పరిపాలనపై సమీక్ష నిర్వహిం చారు. గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి, రోడ్లపై చెత్త, ప్లాస్టిక్‌ వ్యర్థాలు లేకుండా చూడాలన్నారు. డంపింగ్‌ యార్డులు, సెగ్రిగేషన్‌ షెడ్లను పూర్తిస్థాయిలో వినియోగించాలని సూచిం చారు. సీజనల్‌ వ్యాధుల నియంత్రణకు నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టి, క్రమం తప్పకుండా ఫాగింగ్‌ నిర్వహించాలన్నారు. అర్హులైన ప్రతీ లబ్ధిదా రుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చూడాలని, నూతన పింఛన్ల దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేసి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని ఆదేశించారు. గ్రామాల్లో అక్రమ నిర్మాణా లకు అనుమతులు ఇవ్వవద్దని, నిబంధనలకు విరు ద్ధంగా నిర్మాణాలు చేపట్టకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇన్‌చార్జి డీపీఓ శ్రీమాల, డీఎల్‌పీఓలు, ఎంపీఓలు పాల్గొన్నారు.

తాగునీటి సమస్యలు పరిష్కరించాలి

గ్రామాల వారీగా తాగునీటి సమస్యలను గుర్తించి తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శనివారం ఐడీఓసీలో తాగునీటి సరఫరాపై అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లా డుతూ ప్రతీ గ్రామంలో అవసరమైన పైప్‌లైన్లు, అదనపు ఓహెచ్‌ఎస్‌ఆర్‌లు, కొత్త తాగునీటి కనెక్షన్ల వివ రాలను సేకరించి సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని సూచించారు. పంచాయతీ నిధులతో అత్యవసర చిన్న తరహా తాగునీటి పనులను చేపట్టాలని, ఓహెచ్‌ఎస్‌ ఆర్‌లు, పైప్‌లైన్‌ల లీకే జీలు, చిన్నపాటి మరమ్మతులను ఆలస్యం చేయ కుండా పూర్తి చేయాలని ఆదేశించారు. జీపీడీపీలో ప్రతిపాదించిన తాగునీటి పనులకు ప్రభుత్వ అను మతులు, నిధులు త్వరగా మంజూరయ్యేలా జెడ్పీ సీఈఓ పరిశీలించాలన్నారు. జెడ్పీ సీఈఓ నరేందర్‌, మిషన్‌ భగీరథ ఇంట్రా ఈఈ గంగాధర్‌ శ్రీనివాస్‌, అదనపు డీఆర్‌డీఏ అధికారి రవీందర్‌, పాల్గొన్నారు.

Updated Date - Aug 23 , 2026 | 12:08 AM