Share News

రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలి

ABN , Publish Date - Nov 10 , 2026 | 11:37 PM

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఆసుపత్రిలో ఆహారం, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశించారు. మంగళవారం కలెక్టర్‌ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలి

పెద్దపల్లి, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఆసుపత్రిలో ఆహారం, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశించారు. మంగళవారం కలెక్టర్‌ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ప్రతి ఓపీ వార్డు, లేబర్‌ రూమ్‌, క్యాజువాలిటీ విభాగం, ఆపరేషన్‌ థియేటర్‌, ఐసీయూ తదితర విభాగాలను పరిశీలించారు. ఆయా విభాగాల్లో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలు, రోగులకు అందిస్తున్న చికిత్స, వైద్యులు, సిబ్బంది విధుల నిర్వహణపై తెలుసుకున్నారు. కలెక్టర్‌ మాట్లా డుతూ, ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. రోగు లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విభా గాలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఆసుపత్రిలో వైద్యులు, వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలు, చూపుతున్న అంకితభావాన్ని అభినందిం చారు. రోగులకు అందించే ఆహారం నాణ్యతగా, పరి శుభ్రంగా ఉండాలని స్పష్టం చేశారు. వంటశాల, ఆహార తయారీ ప్రాంతాలు, భోజన ప్రదేశాలను ఎప్ప టికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఆసు పత్రికి వచ్చే రోగుల సమస్యలను సానుకూలంగా స్వీకరించి, వాటిని వెంటనే పరిష్కరించేలా అధికారు లు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ, వైద్య సేవల నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు అధికారులు, వైద్యులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీధర్‌, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం విక్రయించాలి

జిల్లాలో బియ్యం కృత్రిమ కొరత సృష్టించకుండా, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించేలా వ్యాపారులు నిబంధనలు పాటించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష మంగళవారం తెలిపారు. బియ్యం అక్రమ నిల్వలకు పాల్పడినా, అధిక ధరలకు విక్రయించినా వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చ రించారు. గత నెల 30 పెద్దపల్లి పట్టణ పరిధిలోని పలు హోల్‌సేల్‌, రిటైల్‌ బియ్యం దుకాణాల్లో క్షేత్ర స్థాయి అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు తెలి పారు. డిప్యూటీ తహసీల్దార్లు, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు దుకా ణాలు, గోదాముల్లోని బియ్యం నిల్వలను పరిశీ లించడంతోపాటు ధరల పట్టికలు, తూకాలు, స్టాక్‌ రిజిస్టర్లను తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం బిపిటి, కేఎన్‌ఎం రకం బియ్యం మిల్లు వద్ద కిలో రూ.62, హోల్‌సేల్‌ ధర రూ. 64, రిటైల్‌ ధర రూ.66గా, ఆర్‌ఎన్‌ఆర్‌/ తెలంగాణ సోనా రకం బియ్యం మిల్లు వద్ద కిలో రూ.70, హోల్‌సేల్‌ ధర రూ.72, రిటైల్‌ ధర రూ. 74గా, హెచ్‌ఎంటి/జై శ్రీరామ్‌ రకం బియ్యం మిల్లు వద్ద కిలో రూ.75, హోల్‌సేల్‌ ధర రూ.77, రిటైల్‌ ధర రూ.79గా నిర్ణయించినట్లు కలెక్టర్‌ తెలిపారు. వ్యాపారులు ఈ ధరలకు మించి విక్రయించరాదని స్పష్టం చేశారు. ప్రతీ దుకాణం, మిల్లు ఎదుట వినియోగదారులకు స్పష్టంగా కనిపించేలా రోజువారీ బియ్యం నిల్వ వివరాలు, ప్రభుత్వం నిర్ణయించిన విక్రయ ధరలతో కూడిన బోర్డును ఏర్పాటు చేయాలని సూచించారు. ట్రేడ్‌ లైసెన్స్‌, జీఎస్టీ లైసెన్స్‌, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అనుమతి పత్రాలు సిద్ధంగా ఉంచాలని, రోజువారీ కొనుగోళ్లు, అమ్మకాల వివరాలను స్టాక్‌ రిజిస్టర్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని తెలిపారు. 26 కిలోల బియ్యం బస్తా పేరుతో 24, 25 కిలోల బియ్యం విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరిం చారు. ఈ నెల 4 నాటికి జిల్లా వ్యాప్తంగా మొత్తం 50 బియ్యం దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి, నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి 8 కేసులు నమోదు చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు.

Updated Date - Nov 10 , 2026 | 11:37 PM