రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలి
ABN , Publish Date - Apr 17 , 2026 | 11:41 PM
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, వైద్యులు సమయపాలన పాటించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.
కళ్యాణ్‌నగర్, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, వైద్యులు సమయపాలన పాటించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆసు పత్రిలోని న్యూ బ్లాక్ ఐసీయూ, మెడికల్ ఓపీ, ఎమర్జెన్సీ విభాగం, డ్యూటీ డాక్టర్స్ గదులు, వార్డు లను తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో శానిటేషన్ మెరుగుపర్చాలని, శానిటే షన్‌పై ఎప్పటికప్పుడు శ్రద్ధ వహించాలని సంబం ధిత ఏజెన్సీకి సూచనలు చేశారు. తక్షణమే తనను కలవాలని కలెక్టర్ ఆదేశించారు. ఆసుపత్రిలో రోగులు పెరుగుతున్న దృష్ట్యా అదనంగా బెడ్‌లను పెంచాలని, మెడిసిన్ విభాగానికి అదనంగా ఒక ఓపీ బ్లాక్ ఏర్పాటు చేయాలని సూచించారు. ల్యాబ్ యంత్రాలు, ఏసీ వంటి పరికరాల్లో ఎలాంటి లోపా లు ఎదురైనా వెంటనే మరమ్మతు చేపట్టాలని, ఆసుపత్రిలో సీసీ రోడ్డు పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో చాలా మంది వైద్యులు పనిచేయడం లేదని కలె క్టర్‌కు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో శుక్రవారం కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్టు సమాచారం. ఆర్‌ఎంఓలు కృపాభాయి, రాజు, వైద్యులు అశోక్, అప్పారావు ఉన్నారు.
వైద్య ఆరోగ్యశాఖ పనితీరుపై సమీక్ష
పెద్దపల్లిటౌన్, (ఆంధ్రజ్యోతి): ప్రజలకు మెరు గైన వైద్య సేవలు అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించిన సం దర్భంగా కలెక్టర్ పలు ఆదేశాలు జారీ చేశారు. ఆయుష్ సేవలపై ప్రజల స్పందన, రోజువారీ ఓపీ వివరాలు తెలుసుకున్నారు. యోగా కేంద్రాల ఏర్పా టుకు స్థలాల లభ్యతపై పరిశీలించాలని సూచిం చారు. అవసరమైన ఔషధాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. ఎక్స్‌రే, 2 డీ ఎకో యంత్రాల పనితీరు ను పరిశీలిస్తూ రోజువారీ పరీక్షల సంఖ్య పెంచాలని, ప్రజలకు ఎక్కువ సేవలు అందించేందుకు చర్యలు తీసు కోవాలని సూచించారు. రోగులకు పరీ క్షల ఫలితాలు త్వరగా అందేలా చర్య లు తీసుకోవాలని తెలిపారు. హెచ్‌పీవీ టీకా ప్రగతి తక్కువగా ఉందని, గత నెలలో 800 మాత్రమే అందించారని, రెండు నెలల్లో 6 వేల టీకాలు లక్ష్యంగా ఆశా, ఏఎన్‌ఎం సిబ్బంది గ్రామాల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు. టీబీ ప్రభావిత ప్రాం తాల్లో పరీక్షలు చేపట్టి రోగులను గుర్తించి చికిత్స అందించాలని సూచించారు. అబార్షన్ ఆడిట్ నిర్వహించాలని, అనధికార స్కానింగ్‌లను అరికట్టా లని ఆదేశించారు. గర్భిణీలపై ప్రత్యేక శ్రద్ధ వహి స్తూ సమయానికి ఔషధాలు, పోషకాహారం అం దేలా చూడాలని తెలిపారు. డయాలిసిస్ రోగులకు నిరంతర చికిత్స సజావుగా అందేలా చూడాలని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్‌కుమార్, డీసీహెచ్‌వో డాక్టర్ శ్రీధర్, అద నపు వైద్యాధికారి వాణిశ్రీ అధికారులు పాల్గొన్నారు.