Share News

మెరుగైన వైద్యసేవలు అందించండి

ABN , Publish Date - Sep 29 , 2026 | 11:59 PM

మాదక ద్రవ్యాల బారిన పడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని అదనపు కలెక్టర్‌ శ్రీరాములు వైద్యాధికారులకు సూచించారు. మంగళవారం గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలోని డీ అడిక్షన్‌ సెంటర్‌ను తనిఖీ చేశారు.

మెరుగైన వైద్యసేవలు అందించండి

కళ్యాణ్‌నగర్‌, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): మాదక ద్రవ్యాల బారిన పడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని అదనపు కలెక్టర్‌ శ్రీరాములు వైద్యాధికారులకు సూచించారు. మంగళవారం గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలోని డీ అడిక్షన్‌ సెంటర్‌ను తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ మాదక ద్రవ్యా ల బారిన పడిన వారికి కౌన్సెలింగ్‌, పునరావాస సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని, గ్రామీ ణ ప్రాంతాల్లో యువత మాదకద్రవ్యాలకు అల వాటు పడకుండా చర్యలు చేపట్టాలని, ఆరోగ్య, సామాజిక, ఆర్థిక నష్టాలపై ప్రజలకు అవగా హన కల్పించాలన్నారు. యువత విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. వివిధ విభాగాలను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలు, వసతులు, పారి శుధ్యం, మందుల లభ్యతపై తెలుసుకు న్నారు. సూపరింటెండెంట్‌ హిమబిందు, తహసీల్దార్‌ రవీందర్‌రావు, సీడీపీఓ అలేఖ్య, ఆర్‌ఐ రాజేం దర్‌, సీ సెక్షన్‌ సూపరింటెం డెంట్‌ కోటేశ్వర్‌రావు పాల్గొన్నారు.

Updated Date - Sep 29 , 2026 | 11:59 PM