Share News

వైద్యులను నియమించాలని నిరసన దీక్ష

ABN , Publish Date - Jul 12 , 2026 | 12:12 AM

మాతా శిశువు ఆసుపత్రిలో వెద్యులను నియమించాలని, లేని పక్షంలో మహిళలతో కలిసి నిరవధిక నిరాహార దీక్షలు చేపడుతామని మంథని మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ పుట్ట శైలజ హెచ్చరించారు.

వైద్యులను నియమించాలని నిరసన దీక్ష

మంథనిరూరల్‌, జూలై 11 (ఆంధ్రజ్యోతి): మాతా శిశువు ఆసుపత్రిలో వెద్యులను నియమించాలని, లేని పక్షంలో మహిళలతో కలిసి నిరవధిక నిరాహార దీక్షలు చేపడుతామని మంథని మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ పుట్ట శైలజ హెచ్చరించారు. పట్టణంలోని మాతా శిశువు ఆసుపత్రిలో డాక్టర్లను నియమించాలని శనివా రం ఆసుపత్రి ఎదుట బీఆర్‌ఎస్‌ మహిళ విభాగం అధ్వ ర్యంలో ఒక్క రోజు నిరసన దీక్ష చేపట్టారు. ఆమె మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని వర్గా లకు మేలు జరిగేలా సంక్షేమ పథకాలు అమలు చేశా రని, అందులో భాగంగా మాతాశిశువు ఆసుపత్రులను ఏర్పాటు చేశారన్నారు. మంథని ఎమ్మెల్యే గెలిచిన వెం టనే మాతాశిశువు అసుపత్రిలోని డాక్టర్లను ఇతర ప్రాంతాలకు పంపించారని, ప్రస్తుతం సిబ్బంది మాత్రమే ఉన్నారని తెలిపారు. వైద్యులు లేకపోవడంతో విలువైన యాంత్రాలు బూజుపట్టి పోతు న్నాయని, కనీసం పరికరాలను విని యోగించుకోవాలని ఆలోచన చేయక పోవడం బాధాకరమన్నారు. జిల్లా వైద్యాఽ దికారితో ఫోన్‌లో మాట్లాడి సమస్యను వివరించారు. అధికారులు స్పందించి వెంటనే డాక్ట ర్లను నియమించాలని అమె డిమాం డ్‌ చేశారు. కేదారి గీత, ఎగోలపు కమళ, తగరం సుమలత, మాదార వేణి శారద, పుప్పాల భాగ్యలక్ష్మి, కనవేన సప్న, కొండ ప్రేమలత, తొంబురపు సుజాత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 12 , 2026 | 12:12 AM