Share News

పెరిగిన వేతనాలు చెల్లించాలని నిరసన

ABN , Publish Date - Feb 17 , 2026 | 12:19 AM

ఎన్టీపీసీ ప్రాజెక్టు పరిధిలోని అద్దె వాహనాల డ్రైవర్లకు పెరిగిన వేతన ఒప్పందం ప్రకారం జీతాలు చెల్లించాలని ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలోని డ్రైవర్ల సంఘం డిమాండ్‌ చేసింది. మూడు నెలలుగా పెరిగిన వేతనాలు చెల్లించకపోవడంతో డ్రైవర్లు సోమవారం ఆందోళనకు దిగారు.

పెరిగిన వేతనాలు చెల్లించాలని నిరసన

జ్యోతినగర్‌, ఫిబ్రవరి16(ఆంధ్రజ్యోతి): ఎన్టీపీసీ ప్రాజెక్టు పరిధిలోని అద్దె వాహనాల డ్రైవర్లకు పెరిగిన వేతన ఒప్పందం ప్రకారం జీతాలు చెల్లించాలని ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలోని డ్రైవర్ల సంఘం డిమాండ్‌ చేసింది. మూడు నెలలుగా పెరిగిన వేతనాలు చెల్లించకపోవడంతో డ్రైవర్లు సోమవారం ఆందోళనకు దిగారు. అగ్రిమెంట్‌ ప్రకారం వేతనాలు చెల్లించాల్సి ఉన్నా వాహన యజమానులు నిర్లక్ష్యం వహిస్తున్నారని డ్రైవర్లు ఆరోపించారు. డ్రైవర్లు ఎన్టీపీసీ ఏడీఎం బిల్డింగ్‌ సమీపంలో విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు. వేతనాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు బూమల్ల చందర్‌ మాట్లాడుతూ గతంలో ఎన్టీపీసీ యాజమాన్యం, ఏఎల్సీ ఆధ్వర్యంలో ఒప్పందం జరిగినా, అద్దె వాహన యజమానులు వేతనాలు చెల్లించకుండా డ్రైవర్లను ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. ఎన్టీపీసీ యాజమాన్యం, లేబర్‌ కమిషనర్‌ చొరవ తీసుకుని, పెరిగిన వేతనాలను చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. శ్రీనివాస్‌ యాదవ్‌, సాగర్‌, దనుంజయ్‌, శ్యామ్‌, సమ్మయ్య, ఇమ్రాన్‌, వంశీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 17 , 2026 | 12:19 AM