Share News

కొవ్వొత్తులతో రజకుల నిరసన

ABN , Publish Date - Feb 23 , 2026 | 12:04 AM

నాగర్‌ కర్నూల్‌ కుమ్మెర మల్లన్న జాతరలో రజక కుటుంబం పై జరిగిన దాడిని నిరసిస్తూ సుల్తానాబాద్‌ పట్టణంలో ఆదివారం రాత్రి రజకులు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహిం చి నిరసన తెలిపారు. నాగర్‌ కర్నూల్‌ కుమ్మెర మల్లన్న జాతరలో రజక కుటుంబంపై దాడి చేసి రెండు నెలల చిన్నారి ప్రాణాలు బలి తీసుకున్నారని రజక సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

కొవ్వొత్తులతో రజకుల నిరసన

సుల్తానాబాద్‌, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): నాగర్‌ కర్నూల్‌ కుమ్మెర మల్లన్న జాతరలో రజక కుటుంబం పై జరిగిన దాడిని నిరసిస్తూ సుల్తానాబాద్‌ పట్టణంలో ఆదివారం రాత్రి రజకులు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహిం చి నిరసన తెలిపారు. నాగర్‌ కర్నూల్‌ కుమ్మెర మల్లన్న జాతరలో రజక కుటుంబంపై దాడి చేసి రెండు నెలల చిన్నారి ప్రాణాలు బలి తీసుకున్నారని రజక సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనను నిరసిస్తూ చని పోయిన చిన్నారి ఆత్మశాంతికి స్థానిక చెరువు రోడ్డులోని రజకనగర్‌ నుంచి మున్సిపల్‌ కార్యాలయం సమీపం లోని చాకలి ఐలమ్మ విగ్రహం వరకు రజకులు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వ హించి నివాళు లర్పించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయ కులు నిట్టూరి శ్రీనివాస్‌, నిట్టూరి అంజయ్య, నిట్టూరి మైసయ్య, రాజేశం, చాతల శివ, నిఖిల్‌, దినేష్‌, కృష్ణ, సంతోష్‌, నీరజ్‌ రాజ్‌, అంజమ్మ నిర్మల, స్వప్న, గంగ మహిళలు పాల్గొన్నారు.

మంథని, (ఆంధ్రజ్యోతి): నాగర్‌కర్నూల్‌ జిల్లా కొమ్మెరలో మల్లన్న జాతర సందర్భంగా ఆలయంలోకి వెళ్ళటానికి ప్రయత్నించిన రజకులను కుల వివక్ష కారణంగా అడ్డుకొని దాడి చేయడంతోపాటు 2 నెలల పసిపాప మృతికి కారణమైన శ్రీనివాస్‌రెడ్డి, సతీష్‌ రెడ్డిలను కఠినంగా శిక్షించాలని రజక సేవా సంఘం నేతలు ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. కొమ్మెర సర్పంచ్‌ ఆదేశంతోనే దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి నిర్లక్ష్యంగా వ్యవ హరించిన ఎస్‌ఐని సస్పెండ్‌ చేయడంతోపాటు నిం దితులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందో ళన చేపడుతామని హెచ్చరించారు. నాయకులు పోతరాజు సమ్మయ్య, శ్రీనివాస్‌, కొల్లూరి రాజయ్య, సమ్మయ్య, నాగరాజు, కొండపర్తి శంకర్‌ ఉన్నారు.

Updated Date - Feb 23 , 2026 | 12:04 AM